Asianet News TeluguAsianet News Telugu

7.5 శాతం ఫిట్‌మెంట్ కు పీఆర్సీ కమిటీ సిఫారసు: కనీస వేతనం రూ. 19 వేలు, గరిష్టంగా రూ. 1.62 లక్షలు

పీఆర్‌సీపై ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సిఫారసులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్ మెంట్ పై ప్రభుత్వం ముగ్గురితో పీఆర్‌సీ పై కమిటీని ఏర్పాటు చేసింది.

PRC commission recommends 7.5 percent fitment for government employees lns
Author
Hyderabad, First Published Jan 27, 2021, 10:17 AM IST

హైదరాబాద్: పీఆర్‌సీపై ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సిఫారసులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్ మెంట్ పై ప్రభుత్వం ముగ్గురితో పీఆర్‌సీ పై కమిటీని ఏర్పాటు చేసింది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గత ఏడాది డిసెంబర్ 31న తన నివేదికను ప్రభుత్వానికి అందించింది.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  7.5 శాతం ఫిట్ మెంట్ ను ఇవ్వాలని పీఆర్‌సీ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. పీఆర్సీ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి.  

ఈ సిఫారసుల ప్రకారంగా కనీస వేతనం రూ. 19 వేలు, గరిష్ట వేతనం రూ. 1.62 లక్షలుగా ఉంది. ఉద్యోగులు, టీచర్లు, పెనన్షర్లకు 10 శాతం ఫిట్‌మెంట్ కు సిఫారసు చేసింది కమిటీ. ఉద్యోగుల వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతూ కమిషన్  సిఫారసు చేసింది. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు కూడ పెన్షన్ ఇవ్వాలని కమిటీ సిఫారసు చేసింది.

కొత్త పీఆర్సీ సిఫారసులతో పాటు ఇతర హామీలపై ఉద్యోగ సంఘాలతో సీఎస్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యరద్శి సోమేష్ కుమార్ చర్చించనున్నారు.ఇవాళ సాయంత్రం సచివాలయంలో టీఎన్జీఓ, టీజీఓ నేతలతో సీఎస్ చర్చించనున్నారు. పీఆర్సీ కమిషన్  చేసిన సిఫారసుల పట్ల ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఫిట్‌మెంట్  గురించి తమకు అధికారిక ఉత్తర్వులు రాలేదని టీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు రాజేందర్ చెప్పారు.  మరోవైపు తమకు చర్చలు గురించి కూడ త్రిసభ్య కమిటీ నుండి అధికారికంగా ఆహ్వానం అందలేదని ఆయన చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios