టిఎన్జీవో నాయకుడు గుండవరపు దేవీ ప్రసాదరావును ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలంగానా బెవరేజెస్ కార్పొరేషన్ ఛెయిర్మన్ గా నియమించారు. తెలంగాణా వచ్చాక ఎన్జీవో నేతలకు మంచి పదవులు లభించినా, దేవీప్రసాద్ కొద్ది గా వెనకబడ్డారు. ఇపుడు ఆయనకు గుర్తింపు లభించింది.  

టిఎన్జీవో నాయకుడు గుండవరపు దేవీ ప్రసాదరావును ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలంగానా బెవరేజెస్ కార్పొరేషన్ ఛెయిర్మన్ గా నియమించారు. ఈ మేరకు కొద్ది సేపటి కింద జివొ విడుదలయింది.

దేవీ ప్రసాద్ తో పాటు, మెదక్ జిల్లాకు చెందిన జి ఎలెక్షన్ రెడ్డిని తెలంగాణా స్టేట్ ఫుడ్ సొసైటీ అధ్యక్షుడిగా నియమించారు.వీరిద్దరి పదవీ కాలం రెండేళ్లు

తెలంగాణా వచ్చాక ఎన్జీవో నేతలకు మంచి పదవులు లభించినా, దేవీప్రసాద్ కొద్ది గా వెనకబడ్డారు. అయితే, 2015 లో ఆయనకు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాజుయేట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన బిజెపి అభ్యర్థి ఎన్ రామచంద్రరావుచేతిలో దాదాపు 13 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఇపుడు ఆయనకు గుర్తింపు నిస్తూ ముఖ్యమంత్రి కార్పొరేషన్ ఛెయిర్మన్ గా నియమించారు.