తెలంగాణ గొంతుకగా టీజేఏసీ వెబ్ సైట్ జేఏసీ కార్యాలయంలో ప్రారంభించిన ప్రొ. కోదండరాం
తెలంగాణ ప్రజల గొంతుకగా అధికార పక్షం తప్పటడుగలను ఎత్తి చూపుతున్న తెలంగాణ రాజకీయ జేఏసీ ఇప్పుడు మరో యుద్ధానికి సిద్ధమైంది.
రెండున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనపై ఇప్పటికే బహిరంగానే విమర్శలు చేస్తూ వస్తున్న టీజేఏసీ ఇప్పుడు తన విమర్శలకు మరింత పదునుపెట్టేందేకు కొత్త దిశగా వెళుతోంది.
ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను ( http://telanganajac.wixsite.com/tjac )కూడా రూపొందించింది. అలాగే, త్వరలోనే ఒక పేపర్ ను కూడా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ జేఏసీ మరింతగా ప్రజలకు చేరువ కావడానికి ఈ ప్రత్యేక వెబ్ సైట్ ను రూపోందించినట్లు జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం తెలిపారు.
హైదరాబాద్ నాంపల్లి లోని జేఏసీ కార్యాలయంలో ఈ రోజు ఆయన జేఏసీ వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా అంబెడ్కర్ మార్గంలో రాజ్యాంగ బద్దంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ఈ సందర్భంగా కోదండరాం స్పష్టం చేశారు.
ఓపెన్ కాస్ట్ మైనింగ్ పై మాట్లాడుతూ... అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. మరోవైపు తెలంగాణలో పెద్దఎత్తున చెరువల్లో, రిజర్వాయర్లలో చేపలు పెంచుతున్నందున ఫిషరీస్ పాలసీపై ప్రత్యేక డాక్యూమెంటరీ రూపొందించామని దాని పై విస్తృత స్థాయిలో చర్చ జగరాలని సూచించారు.
