Asianet News TeluguAsianet News Telugu

వరదలో కొట్టుకొచ్చిన మూడు శవాలు: హైదరాబాదులో 15 మంది మృతి

భారీ వర్షాలకు హైదరాబాదు చిగురుటాకులా వణుకుతోంది. గగన్ పహాడ్ వద్ద మూడు మృతదేహాలు వరదలో కొట్టుకుని వచ్చాయి. మైలార్ దేవ్ పల్లి పద్ద రెండు బస్సులు వరదలో చిక్కుకున్నాయి.

Three dead bodies found in flood waters in Hyderabad
Author
Hyderabad, First Published Oct 14, 2020, 9:40 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు చిగురాటుకాల వణుకుతోంది. భారీ వర్షాలు హైదరాబాదులో బీభత్సం సృష్టించాయి. ఇప్పటి వరకు వర్షానికి సంబంధించిన కారణాలతో 15 మంది మృత్యువాత పడ్డారు. పాతబస్తీలో 9 మంది మరణించిన విషయం తెలిసిందే. గగన్ పహాడ్ వద్ద మూడు మృతదేహాలు వరదలో కొట్టుకుని వచ్చాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

చాదర్ ఘాట్ వద్ద మూసీ నది ప్రమాదకరమైన స్థాయిలో ప్రవహిస్తోంది. ఉస్మాన్ సాగర్ కు వరద నీరు పెరిగింది. హైదరాబాదులో దాదాపు 1500 కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అపార్టుమెంటుల్లోని సెల్లార్లు నీటితో నిండిపోయాయి. ముందు జాగ్రత చర్యగా అపార్టుమెంట్లలోని లిఫ్టులను నిలిపేశారు. హైదరాబాదులో పలు ప్రాంతాలు మంగళవారం రాత్రి నుంచి కరెంట్ లేక చీకట్లో మగ్గుతున్నాయి. 

Also Read: హైదరాబాద్ లో వర్ష బీభత్సం: 9 మంది మృతి

హైదరాబాదులో రోడ్లు నదుల్లా, కాలనీలు చెరువుల్లా మారాయి. ఘట్కేసర్ లో అత్యధికంగా 32.3 శాతం వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. 

వరంగల్, హైదరాబాదు జాతీయ రహదారిపై వరద నీరు పెద్ద యెత్తున ప్రవహిస్తోంది. మైలార్ దేవ్ పల్లిలో రెండు బస్సులు వరదలో చిక్కుకున్నాయి.  ప్రయాణికులు బస్సుపైకి ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. వాటిని వెలికి తీసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

Also Read: హైద్రాబాద్ సహా తెలంగాణ జిల్లాలకు రెడ్ అలెర్ట్: మరో రెండు రోజులు భారీ వర్షాలు 

హైదరాబాదుకు వచ్చే పలు రోడ్లపై వరద నీరు ప్రవహిస్తూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. మరో రెండు రోజుల పాటు హైదరాబాదులో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరో రెండు రోజులు ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. 

సంప్రదించాల్సిన నెంబర్లు

అత్యవసర సేవ కోసం.. 040-211111111, జిహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ - 90001 13667, 97046 01866, జిహెచ్ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583, జీహెచ్ఎంసీ విద్యుత్తు శాఖ - 94408 13750, ఎన్డీఆర్ఎఫ్ సేవల కోసం 83330 68536, 040 2955 5500,

Follow Us:
Download App:
  • android
  • ios