టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్: మరో ముగ్గురు అరెస్ట్

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  కేసులో  సిట్ బృందం  ముగ్గురిని  అరెస్ట్  చేసింది.   ఏఈఈ ప్రశ్నాపత్రం  కొనుగోలు  చేసిన ముగ్గురిని సిట్  అరెస్ట్  చేసింది.  
 

Three Arrested  in TSPSC  Paper leak Case  lns

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ కేసులో  మరో ముగ్గురిని  సిట్ బృందం   సోమవారం నాడు  అరెస్ట్ చేసింది, అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్నాపత్రం  కొనుగోలు  చేసిన ముగ్గురిని  సిట్ బృందం  అరెస్ట్  చేసింది.  టీఎస్‌పీఎస్‌సీలో  పనిచేసే ప్రవీణ్ నుండి   ప్రశ్నాపత్రం కొనుగోలు  చేసిన  ముగ్గురిని  సిట్ టీమ్ అరెస్ట్  చేసింది.  మనోజ్, మురళీధర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని  సిట్  అరెస్ట్  చేసింది.  ఏఈ ప్రశ్నపత్రాన్ని  రూ. 10 లక్షలకు  ప్రవీణ్ విక్రయించారని  సిట్ బృందం  గుర్తించింది.  ఏఈ ప్రశ్నాపత్రాన్ని ఆరుగురికి ప్రవీణ్ విక్రయించారని  సిట్ గుర్తించింది.   టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో  ఇప్పటకే 21 మందిని సిట్ అరెస్ట్  చేసింది.  ఇవాళ అరెస్ట్  చేసిన  ముగ్గురితో  అరెస్టైన వారి సంఖ్య  24కు చేరింది.

also read:పేపర్ లీక్‌లో కీలక పరిణామం: టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్, సెక్రటరీలను విచారిస్తున్న ఈడీ

టీఎస్‌పీఎస్‌సీలో తొలుత  కంప్యూటర్లు హ్యాక్ అయినట్టుగా  అనుమానించారు.  కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయనే  అనుమానంతో  ఈ ఏడాది  మార్చి మాసంలో  నిర్వహించాల్సిన  పరీక్షలను వాయిదా వేశారు.  ఈ ఏడాది మార్చి 12, 15, 16 తేదీల్లో  జరగాల్సిన  టౌన్ ప్లానింగ్  ఓవర్సీస్,   అసిస్టెంట్ సివిల్ సర్జన్ నియామాకాల పరీక్షలను వాయిదా వేశారు.

అయితే  కంప్యూటర్లు హ్యాక్ కాలేదని టీఎస్‌పీఎస్‌సీ  ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని  పోలీసులు గుర్తించారు.  దీంతో  ఈ  కేసు విచారణను సిట్ కు అప్పగించింది ప్రభుత్వం.   అయితే  ఈ ఏడాది మార్చి  5న  జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్  పరీక్ష పేపర్  లీకైనట్టుగా  సిట్ గుర్తించింది.  ఈ కేసులో  ఈడీ కూడా  రంగంలోకి దిగింది.   పేపర్ల లీక్ లో పెద్ద ఎత్తున   డబ్బులు చేతులు మారాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి   ఈడీకి ఫిర్యాదు చేశాడు.

దీంతో  ఈడీ రంగంలోకి దిగింది.  ఈ కేసును ఈడీ కూడా విచారిస్తుంది.  ఇప్పటికే టీఎస్‌పీఎస్‌సీలో  పనిచేసిన సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి,  మరో ఉద్యోగిని  ఈడీ అధికారులు విచారించారు.  జైలులో  ఉన్న  ప్రవీణ్,  రాజశేఖర్ రెడ్డిలను  కూడ ఈడీ విచారించింది.  ఈ నెల  1వ తేదీన  టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్  జనార్ధన్ రెడ్డి, సెక్రటరీలను  సుమారు  10 గంటల పాటు  ఈడీ అధికారులు విచారించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios