ఓ ఆలయంలో చోరీకి ప్రయత్నించాడో దొంగ. అడ్డుకున్న వాచ్ మెన్ మీద రాళ్లతో దాడి చేశాడు. ప్రతిదాడిలో తల పగిలి చనిపోయాడు.
హైదరాబాద్ : హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ ఆలయంలో చోరీ ప్రయత్నం జరిగింది. గుర్తు తెలియని దుండగుడు ఆలయంలోకి ప్రవేశించి చోరీకి యత్నించాడు. ఇది గమనించిన వాచ్ మెన్ దుండగుడిని అడ్డుకున్నాడు. దీంతో వాచ్ మెన్ మీద రాళ్లతో దాడి చేశాడు. పెనుగులాటలో తీవ్ర గాయాలు కావడంతో దొంగ అక్కడికక్కడే మృతి చెందాడు. దొంగ తలపగిలి మృతి చెందినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
