కోరుట్ల ఓ కౌన్సిలర్ భర్త దారుణ హత్యకు గురయ్యాడు. అతడిపై పలువురు దుండగులు కత్తితో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి ఆయన మరణించాడు.

ఓ కౌన్సిలర్ భర్తను పలువురు దుండుగులు దారుణంగా హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో జరిగింది. అతడు రోడ్డుపై టీ తాగుతుండగా దుండగులు హఠాత్తుగా దాడి చేశారు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. కొంత సమయం తరువాత ఆయన మరణించాడు.

కుక్కను కొట్టి, తాడుతో బంధించి, రోడ్డుపై ఈడ్చుకెళ్లి చంపిన అల్లరి మూక.. వీడియో వైరల్

వివరాలు ఇలా ఉన్నాయి. కోరుట్లలో మున్సిపల్ కౌన్సిలర్ గా పని చేస్తున్న ఓ మహిళ భర్త 48 ఏళ్ల లక్ష్మీరాజం మంగళవారం కార్గిల్ చౌరస్తాలో దగ్గరలో ఉన్న ఓ హోటల్ కు వెళ్లాడు. అక్కడ టీ తాగుతున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. అతడిపై కత్తితో దాడి చేశారు. మెడపై నరికి, అక్కడి నుంచి బైక్ పై పారిపోయారు. స్థానికులు గమనించి వెంటనే అతడిని కరీంనగర్ కు తీసుకెళ్లారు. అక్కడి ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కోసం జాయిన్ చేశారు.

ఎస్ఐగా ఎంపికైన హమాలీ కూతురు.. లక్ష్యం ముందు ఓడిపోయిన పేదరికం..

అయితే అప్పటికే అతడి పరిస్థితి విషమంగా ఉంది. డాక్టర్లు వెంటనే ట్రీట్ మెంట్ మొదలుపెట్టినా కూడా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి ఆయన మరణించాడు. దీనిపై సమాచారం అందిన వెంటనే స్థానిక డీఎస్పీ, సీఐ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.