ఎస్ఐగా ఎంపికైన హమాలీ కూతురు.. లక్ష్యం ముందు ఓడిపోయిన పేదరికం..

మహబూబ్ బాద్ జిల్లా కు చెందిన పేదింటి ఆడబిడ్డ ఎస్ఐ ఫలితాల్లో ప్రతిభ కనబర్చింది. తొలి ప్రయత్నంలోనే సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యింది. ఆ యువతి తండ్రి హమాలీ కూలీగా పని చేస్తున్నారు.

Hamalis daughter who was selected as SI.. Poverty defeated before the target..ISR

ఆమె ఓ పేదిండి ఆడబిడ్డ. తండ్రి హమాలీ కార్మికుడిగా పని చేస్తున్నారు. పదో తరగతి వరకు రెగ్యులర్ గా చదివిన ఆమె తరువాత ఓపెన్ లో డిగ్రీ చదవి, ఓయూలో పీజీ పూర్తి చేశారు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూనే గ్రూప్ -1 కు సిద్ధమయ్యారు. తొలిప్రయత్నంలోనే ఎస్ఐగా ఎంపికై.. లక్ష్యానికి పేదరికం అడ్డురాదని నిరూపించారు. ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

హత్యాచారానికి గురైన కూతురు.. దహన సంస్కారాల సమయంలో కుప్పకూలిన తండ్రి..

మహబూబ్ బాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామానికి చెందిన కుమారస్వామి-పద్మ దంపతుల కూతురు బొల్లాబోయిన హేమలత ఇటీవల ప్రకటించిన ఎస్ఐ ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. ఆమె సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యారు. తండ్రి కుమారస్వామి హమాలీ కూలిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమెకు ఓ సోదురుడు, సోదరి ఉన్నారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాలు చూస్తూ పెరిగిన హేమలత.. పదో తరగతి వరకు గ్రామంలోనే చదివారు. తరువాత నర్సంపేటలో ఇంటర్ మీడియట్ పూర్తి చేశారు. మళ్లీ కొంత కాలం తరువాత ఓపెన్ లో డిగ్రీ పూర్తి చేశారు. చదువుకుంటూనే తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలిచేవారు.

పాక్ మహిళ ట్రాప్ లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. సోషల్ మీడియాలో రెండేళ్లుగా స్నేహం.. న్యూడ్ వీడియో కాల్స్ తో వలలో

ఈ క్రమంలోనే చెల్లెలు పెళ్లి చేసింది. అయితే ఆమె మాత్రం జీవితంలో తన లక్ష్యం నెరవేరే వరకు పెళ్లి చేసుకోకూడదని భావించింది. అందుకే డిగ్రీ పూర్తయిన తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదివారు. అప్పటి నుంచి గ్రూప్ -1కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఎస్ఐ ఉద్యోగాల కోసం తెలంగాణ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయడంతో దానికి సిద్ధమయ్యారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యారు. ఆమె విజయంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్ష్యం వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలోనూ గెలిస్తే కేంద్రం మెడలు వంచేది మనమే: కేసీఆర్

ప్రస్తుతం వచ్చిన ఎస్ఐ జాబ్ తో  తృప్తి పడకుండా గ్రూప్-1 కు ప్రిపేర్ అవుతానని హేమలత చెప్పారు. ఐపీఎస్ కావడతమే తన జీవితాశయమని పేర్కొన్నారు. ఆమె ప్రతిభకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హేమలతకు అభినందనలు తెలుపుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios