ఓ కుక్కపై పలువురు యువకులు దారుణంగా ప్రవర్తించారు. దానిని చిత్రహింసలకు గురి చేసి చంపారు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఛత్తీస్ గఢ్ లో దారుణం జరిగింది. ఓ మూగ జంతువు పట్ల అల్లరి మూక తీవ్ర హింసకు పాల్పడింది. దానిని తీవ్రంగా చితకబాది, తాడుతో కట్టి, రోడ్డుపై ఈడ్చుకెళ్లి హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. 

ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 22 రోజుల పాటు పలుమార్లు అత్యాచారం.. మత్తు మందు ఇచ్చి వ్యభిచారంలోకి..

వివరాలు ఇలా ఉన్నాయి. రాయ్ పూర్ లో గుడియారి గ్రామంలో ఇటీవల ఓ అల్లరి మూక ఓ కుక్క పట్ల దారుణానికి పాల్పడ్డారు. మూగ జంతువు అని కూడా చూడకుండా దానిని నిర్ధాక్షిణ్యంగా కొట్టారు. అనంతరం దాని మెడకు తాడు కట్టారు. రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. చనిపోయే వరకు దానిని చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటనను అక్కడున్న పలువురు వీడియో తీశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ గా మారింది.

కాగా.. ఆ అల్లరి మూక కుక్కను చిత్రహింసలకు గురి చేసే సమయంలో అటు నుంచి ఇద్దరు పోలీసులు వెళ్లారు. కానీ వారిని ఏమీ అనలేదు. ఆ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కేవలం 50 మీటర్ల దూరంలోనే ఓ పోలీస్ స్టేషన్ ఉంది. కానీ వారిపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

హత్యాచారానికి గురైన కూతురు.. దహన సంస్కారాల సమయంలో కుప్పకూలిన తండ్రి..

ఈ ఏడాది ఏప్రిల్ లో హర్యానాలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. గుర్గావ్ లోని సెక్టార్-109 సొసైటీలో పనిచేసే ఓ మహిళ.. మూగజీవులపై దారుణంగా వ్యవహరించింది. కుక్క పిల్లలను వాకింగ్ తీసుకెళ్లేందుకు బయటకు వచ్చింది. ఈ క్రమంలో రెండు కుక్క పిల్లలతో పనిమనిషి లిప్టు ఎక్కింది. ఆ తర్వాత లిఫ్టు డోర్లు మూసుకోగానే ఆమె తన ప్రతాపం ఆ మూగజీవాలపై చూపించింది. 

ఎస్ఐగా ఎంపికైన హమాలీ కూతురు.. లక్ష్యం ముందు ఓడిపోయిన పేదరికం..

ఎక్కడి కోపమో తెలియదు కాదనీ, చిన్న కుక్క పిల్లలపై విరుచుకుపడింది. ఎంతలా అంటే.. ఓ కుక్కపిల్లను దాని మెడలో ఉన్న తాడును పట్టుకుని.. తిప్పితిప్పి నేల కేసి బాదింది. నిజంగా ఆ వీడియో చూసిన ఏ మనిషికైనా .. ఆ పనిమనిషి మీద కోపం రాక మానదు. ఆ పని మనిషి చేసిన దాష్టికం లిఫ్టులోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో వైరల్‌గా మారింది. దీంతో వెంటనే పీపుల్ ఫర్ ఎనిమల్స్ (PFA) వాలంటీర్లు యాక్టివ్ అయ్యారు. మొత్తం ఘటనపై బజ్‌ఘెడా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు.