హైదరాబాద్: భూమి పట్టా లేదని చెప్పడంతోనే తాను ఎమ్మార్వో విజయా రెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించానని నిందితుడు సురేష్ చెప్పారు. అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో (తహసీల్దార్) విజయారెడ్డిని సజీవ దహనం చేసిన నిందితుడు సురేష్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.

AlsoRead విజయారెడ్డి సజీవదహనం.... అందుకే చంపానంటున్న నిందితుడు సురేష్...

సోమవారం నాడు మధ్యాహ్నం అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో కార్యాలయంలోనే విజయారెడ్డిని పెట్రో‌ల్ పోసి సురేష్ నిప్పంటించాడు. ఈ ఘటనలో విజయా రెడ్డి అక్కడికక్కడే మృతి చెందింది. విజయా రెడ్డికి నిప్పంటించడంతో సురేష్ కు కూడ గాయాలయ్యాయి.

AlsoRead Tahsildar vijaya: సురేష్‌ వెనుక ఎవరున్నారు?, కాల్‌డేటా ఆధారంగా విశ్లేషణ...

తన భూమి విషయంలో పట్టా ఇవ్వాలని ఎమ్మార్వో విజయారెడ్డి వద్దకు వెళ్లినట్టుగా సురేష్ చెప్పారు. ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లే సమయంలో తన సంచిలో పెట్రోల్‌ బాటిల్‌లో నింపుకొని వెళ్లినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.

భూ పట్టా కోసం తాను ఎమ్మార్వో తో వాదనకు దిగినట్టుగా చెప్పారు. పట్టా లేదని ఎమ్మార్వో చెప్పడంతో  తాను ఆమెపై పెట్రోల్ పోసినట్టుగా సురేష్ గుర్తు చేసుకొన్నారు.  తాను కూడ చనిపోవాలనుకొన్నానని సురేష్ చెప్పారు.

also read:vijayareddy: తహసీల్దార్ విజయారెడ్డి హత్య....బయటపడుతున్న షాకింగ్ నిజాలు

ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చే సమయంలో తన భూమి విషయంలో ఎమ్మార్వో విజయారెడ్డితో తాడో పేడో తేల్చుకోవాలని  నిర్ణయం తీసుకొని వచ్చినట్టుగా  ఆయన గుర్తు చేసుకొన్నారు. 

సురేష్ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సురేష్ ను పోలీసులు  సోమవారం నాడు తొలుత హయత్‌నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  సోమవారం సాయంత్ర అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.