అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు ఎక్కడ చూసినా... ఈమె హత్య గురించే చర్చించుకుంటున్నారు. ఆమె హత్య అనంతరం దానికి సంబంధించి ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. 

గతంలో నిందితుడు సురేష్... భూ వివాదంపై పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల కోసం తహసీల్దార్‌పై వత్తిడి తెచ్చాడని.. అయితే విజయారెడ్డి తనకు అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంతో హత్య చేసినట్లు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇదిలా ఉంటే....  1990 నుంచి ఈ భూములపై వివాదం నడుస్తోంది. 2004 తర్వాత భూములపై కొందరు రాజకీయ నాయకుల కళ్లు ఆ భూముల పడ్డాయనే వాదనలు కూడా వినిపించాయి.

ఈ వివాదస్పదమైన భూముల వ్యవహారంలో తల దూర్చిన కొందరు పెద్దలు.. మరోవైపు భూములు కొన్న పెద్దలు తమకు అనుకూలంగా రికార్డులు మార్చాలని అధికారులపై ఒత్తిళ్లు చేసినట్లు తెలుస్తోంది. 120 ఎకరాల వివాదంపై హైకోర్టులో కేసులున్నాయి. 

AlsoRead విజయారెడ్డి సజీవదహనం.... అందుకే చంపానంటున్న నిందితుడు సురేష్...

కౌలుదారుల చేతిలో 77 ఎకరాలు.. పట్టాదారుల ఆధీనంలో 42 ఎకరాలు ఉన్నట్లు సమాచారం. కాగా.. వివాదాస్పద భూముల వ్యవహారంలో మంత్రి పేరు, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాకు చెందిన రాజకీయ నేతలు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ మంత్రి ఎవరు..? ఆ నేతలు ఎవరు..? అనేదానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది.

AlsoRead Tahsildar vijaya: సురేష్‌ వెనుక ఎవరున్నారు?, కాల్‌డేటా ఆధారంగా విశ్లేషణ...
 
కాగా.. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయా రెడ్డిని ఆమె కార్యాలయంలో, ఆమె చాంబర్లో తలుపులు వేసి, పెట్రోలు పోసి కాల్చి చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. మంటలు అంటుకున్న విజయారెడ్డిని రక్షించేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌, అటెండర్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. అక్కడే ఉన్న మరో రైతుకు కూడా కాలిన గాయాలయ్యాయి. నిందితుడు సురేశ్‌ కూడా మంటలు అంటుకుని గాయపడ్డాడు.