దగా పడ్డ తెలంగాణా కంది రైతు ఆగ్రహం, అవేదనను ఈ మహిళా రైతు ఎలా వ్యక్తీకరించిందో చూడండి...

‘ఈసారి తెలంగాణా రాష్ట్రంలో కంది పంట దిగుబడి తగ్గింది! అమ్ముకుంటే మంచి రేటు వస్తుంది’ పంటవేసుకోండని రైతులను ఉసి కొల్పారు.

రైతులు పంటే వేసుకున్నారు. తీరా పంటతో మార్కెట్‌లో అడుగుపెట్టిన రైతులు. రేటు పతనంతో నిలువునా మునిగిపోయారు. అర్థికంగా కుంగిపోయారు.

పంట వేసుకోండనిపురమాయించిన వాళ్లెవరూ అదుకునేలా కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రానికి వెళ్లిన రైతులు నిరాశగా తిరిగొస్తున్నారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా గత ఏడాది ఎక్కువ మంది రైతులు ఇతర పంటల నుంచి కంది వైపు మళ్లారు. సాగు చేశారు. విత్తే నాడు ఉన్న క్వింటాలు ధర ఇపుడు లేదు.పూటపూటకు పడిపోతున్నది. దీనికి తోడు ఆశించినంతగా కంది పంటా చేతికి రాలేదు. దిగుబడి బాగా తగ్గింది. దీనికి తోడు రేటు లేదు. 

పంట ధర మీద ఆశలు పెట్టుకొన్న రైతులకు నిరాశే ఎదురయింది. కందుల కొనుగోలుపై మార్కెటింగ్ శాఖా మంత్రి హరీష్ రావు ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయడంలేదని రైతలు విమర్శిస్తున్నారు. తేమ, నాణ్యత పేరుతో ధర తగ్గించి దగా చేస్తున్నారని కంది వారు ఆవేదన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో ఒక రైతమ్మ ఆవేదన ఇది... వినండి.