MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Telangana
  • Fake Rapido Driver: హైదరాబాద్‌లో కొత్త టైప్ ఫ్రాడ్.. ఫేక్ రాపిడో డ్రైవర్‌ బ్యాండ్ బాజాయించిన యువతి

Fake Rapido Driver: హైదరాబాద్‌లో కొత్త టైప్ ఫ్రాడ్.. ఫేక్ రాపిడో డ్రైవర్‌ బ్యాండ్ బాజాయించిన యువతి

Hyderabad Fake Rapido Driver: చార్మినార్ వద్ద నకిలీ రాపిడో డ్రైవర్ కలకలం రేగింది. యాప్, నంబర్ ప్లేట్ లేని బైక్‌పై మోసం చేసేందుకు యత్నించిన వ్యక్తిని అప్రమత్తమైన యువతి సమయస్ఫూర్తితో నిలదీసింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 11 2026, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
యాప్ లేదు.. నంబర్ ప్లేట్ అసలే లేదు.. నైట్ టైమ్ చార్మినార్ వద్ద షాకింగ్ సీన్
Image Credit : Instagram/iamsiddhi33

యాప్ లేదు.. నంబర్ ప్లేట్ అసలే లేదు.. నైట్ టైమ్ చార్మినార్ వద్ద షాకింగ్ సీన్

హైదరాబాద్ నగరం అనగానే చారిత్రక కట్టడాలు, సందడి ప్రదేశాలు గుర్తుకొస్తాయి. అయితే, అదే చార్మినార్ ప్రాంతంలో రాత్రి వేళ ఒక విచిత్రమైన, కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి సరిగ్గా 9 గంటల సమయం.. కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తున్న సిద్ధేశ్వరి సుగంధ్ (సిద్ధి) అనే యువతి చార్మినార్ పరిసర ప్రాంతంలో ఇంటికి వెళ్లడానికి ఆటో కోసం వెయిట్ చేస్తోంది. చలిగా ఉండటంతో కుర్తీ, షాల్ కప్పుకుని నిలబడి ఉన్న ఆమె దగ్గరకు ఓ వ్యక్తి స్కూటర్‌పై వచ్చి ఆగాడు. "మ్యామ్.. ఎక్కడికి వెళ్లాలి? రాపిడో కావాలా? డ్రాప్ చేయమంటారా?" అంటూ చాలా నమ్మకంగా మాట కలిపాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నంబర్ ప్లేట్ లేదు.. ఐడీ అడిగితే అసలు రంగు బయటపడింది
Image Credit : Instagram/iamsiddhi33

నంబర్ ప్లేట్ లేదు.. ఐడీ అడిగితే అసలు రంగు బయటపడింది

ఆ వ్యక్తి అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడేసరికి సిద్ధేశ్వరి వెంటనే అప్రమత్తమైంది. అసలు తాను ఎలాంటి రాపిడో రైడ్ బుక్ చేసుకోకుండా ఇతను నేరుగా వచ్చి ఎలా అడుగుతున్నాడా అని సందేహించింది. వెంటనే ఆమె తన మొబైల్‌లో రికార్డింగ్ ఆన్ చేసి, అతడి వాహనాన్ని గమనించింది. విచిత్రమేమిటంటే ఆ స్కూటర్‌కు కనీసం వెహికల్ నంబర్ ప్లేట్ కూడా లేదు. "బండికి నంబర్ ఏది? నీ రాపిడో డ్రైవర్ ఐడీ కార్డు చూపించు" అని సిద్ధి గట్టిగా నిలదీసింది. దాంతో ఆ వ్యక్తి కంగారుపడుతూ నీళ్లు నమగడం మొదలుపెట్టాడు. ఐడీ కార్డు చూపించమంటే.. అప్పటికప్పుడు తన ఫోన్‌లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి రాపిడో యాప్ డౌన్‌లోడ్ చేయడం ప్రారంభించాడు.

34
యాప్ లాగిన్ డ్రామా.. బండారం బయటపెట్టి వార్నింగ్
Image Credit : Instagram/iamsiddhi33

యాప్ లాగిన్ డ్రామా.. బండారం బయటపెట్టి వార్నింగ్

తన పేరు ఇర్ఫాన్ అని చెప్పిన ఆ వ్యక్తి, క్రెడెన్షియల్స్ చూపించకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, విచిత్రంగా "బండి స్టార్ట్ కావడం లేదు మేడమ్" అంటూ సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. అసలు స్టార్ట్ కూడా కాని బైక్ పెట్టుకుని, ఎలాంటి బుకింగ్ లేకుండా ప్యాసింజర్లను ఎక్కించుకోవడానికి ఎలా వస్తావని ఆమె తీవ్రంగా మండిపడింది. అతడి ఫోన్ స్క్రీన్ చూస్తే అప్పుడే ఓటీపీ అడిగే లాగిన్ పేజీ కనిపిస్తోంది. అతడు అసలు రాపిడో డ్రైవరే కాదు. "బండి నడవదు.. యాప్ లేదు.. నన్ను డ్రాప్ చేస్తావా? సిగ్గుండాలి.. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో" అంటూ ఆ యువతి గట్టిగా హెచ్చరించడంతో ఆ కేటుగాడు అక్కడ నుంచి జారుకున్నాడు.

44
అలర్ట్‌గా ఉండండి.. స్పందించిన రాపిడో సంస్థ
Image Credit : Instagram/iamsiddhi33

అలర్ట్‌గా ఉండండి.. స్పందించిన రాపిడో సంస్థ

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సిద్ధేశ్వరి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. రాత్రి 9 గంటల సమయంలో ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఒక మహిళ వద్దకు వచ్చి రైడ్ ఆఫర్ చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆమె పేర్కొంది. కాగా, తాను రాపిడో యాప్‌ను క్రమం తప్పకుండా వాడుతుంటానని, సంస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, కేవలం రాపిడో పేరును వాడుకుని మోసం చేసే ఇలాంటి నకిలీ వ్యక్తుల పట్ల మహిళలను అప్రమత్తం చేయడానికే ఈ వీడియో చేసినట్లు స్పష్టం చేసింది.

ఈ వీడియోపై రాపిడో కంపెనీ కూడా వెంటనే స్పందించింది. సిద్ధేశ్వరి అప్రమత్తతను అభినందిస్తూ.. యాప్‌లో రైడ్ బుక్ చేయకుండా నేరుగా వచ్చి రైడర్లమని చెప్పే వారిని అస్సలు నమ్మవద్దని స్పష్టం చేసింది. ప్రయాణికులు ఎల్లప్పుడూ యాప్‌లోని డ్రైవర్ ఐడీ, వాహనం నంబర్, ఓటీపీ సరిచూసుకున్న తర్వాతే ప్రయాణించాలని సూచించింది.

View this post on Instagram

A post shared by Siddeshwari sugandh (@iamsiddhi33)

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
Recommended image2
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే
Recommended image3
ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌.. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం
Related Stories
Recommended image1
Planetary Parade: నక్షత్రాల వర్షం.. ఆకాశంలో అరుదైన అద్భుతం.. ఒకే రోజు 4 ఖగోళ వింతలు
Recommended image2
Batwara 1947: మానవత్వం కంటే ఏదీ గొప్పది కాదు.. ‘బట్వారా 1947’ ఎందుకు చూడాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved