కరీంనగర్ శాతవాహన యూనివర్శిటీలో టెన్షన్

కరీంనగర్ శాతవాహన యూనివర్శిటీలో టెన్షన్

కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివాదాస్పద మనుధర్మ శాస్ర్తం పుస్తకాన్ని ఒక వర్గం విద్యార్థి సంఘాల నాయకులు తగలబెట్టారన్నదానిపై వివాదం నెలకొంది. భారత మాత పటాన్ని తగలబెట్టారని మరో విద్యార్థి సంఘం ఆరోపించింది. దీంతో ఇరు వర్గాల వారు రాళ్ల వర్షం కురిపించుకున్నారు. కేవలం మనుధర్మ శాస్త్రం పుస్తకాన్ని తగులబెట్టారా? ఇంకేదైనా జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ విషయంలో మనుధర్మ శాస్త్రం పుస్తకం తగలబెట్టినా.. భారతమాత చిత్ర పటం అంటూ మరో వర్గం వారు హడావిడి చేసి ఉద్రిక్తతకు కారకులయ్యారా అన్నది తేలాల్సి ఉంది.

అయితే పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అరెస్టు చేశారు. సుమారు 100 మంది వరకు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ఆందోళనకారును అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కొంతమంది విద్యార్థులకు గాయాలైనట్లు పోలీసులు చెబుతున్నారు. విద్యార్థుల మధ్య గొడవల కారణంగా శాతవాహన యూనివర్శిటీ ప్రాంగణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. యూనివర్శిటీ మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. చిన్న వివాదాన్ని విద్యార్థి సంఘాలు పెద్దగా చేసి గొడవలకు కారణమయ్యారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అదుపులోకి తీసుకున్న విద్యార్థులను కరీంనగర్ లోని పలు పోలీసు స్టేసన్లకు తరలించారు.

ఈ ఘటనలకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos