చెన్నమనేని కేసులో హైకోర్టు స్టే ఆరు వారాల పాటు స్టే ఇచ్చిన హైకోర్టు కేంద్ర నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన చెన్నమనేని
తెలంగాణలోని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ రావు కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఆరు వారాల పాటు నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది.
చెన్నమనేని రమేష్ కు భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బిజెపి నేత ఆది శ్రీనివాస్ ఏండ్ల తరబడి న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు. చెన్నమనేని తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించినట్లు ఆయన ఆరోపించారు. ఈమేరకు ఉమ్మడి హైకోర్టులో కేసు గెలిచారు ఆది శ్రీనివాస్. అయితే కేసును సుప్రీంకోర్టులో చెన్నమనేని చాలెంజ్ చేశారు. అక్కడ కూడా చెన్నమనేనికి అనుకూలంగా తీర్పు రాలేదు. ఆయన పౌరసత్వం పై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ను సుప్రీం కోర్ట్ ఆదేశించింది.
ఆ మేరకు చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించారు. తన భారత పౌరసత్వం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని అభ్యర్థించారు.
చెన్నమనేని అభ్యర్థనపై హైకోర్టు సానుకూలంగా స్పందించి ఆరు వారాల పాటు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
