Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ మహిళా జనసమితి ఏర్పాటు...

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జన సమితి పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్మాణంలో భాగంగా మహిళల సముచిత స్థానం కల్పించేందుకు మహిళా జనమితిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. 

telangana women janasamithi announcement
Author
Hyderabad, First Published Oct 16, 2018, 7:31 PM IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జన సమితి పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్మాణంలో భాగంగా మహిళల సముచిత స్థానం కల్పించేందుకు మహిళా జనమితిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. 

ఈ మహిళా జనసమితి విభాగం తొమ్మిది మంది సభ్యులతో ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఈ విభాగానికి రాష్ట్ర కన్వీనర్‌గా రాగులపల్లి లక్ష్మీ, కోఆర్డినేటర్‌గా వెన్న మమతలను నియమించారు. వీరితో మరో ఏడుగురిని కో-కన్వీనర్లుగా నియమించినట్లు కోదండరాం ప్రకటించారు. 

టీజేఎస్ పార్టీ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు ముమ్మరం చేసింది. మహాకూటమిలో భాగస్వామిగా వుంటూ కీలకంగా వ్యవహరిస్తోంది. అయితే అంతర్గతంగా కూడా పార్టీని బలోపేతం చేయడానికి మహిళలకు పార్టీలో ప్రాతినిధ్య కల్పించాలని భావించారు. అందువల్లే మహిళా జన సమితి పేరుతో ప్రత్యేకంగా  ఓ విభాగాన్ని ఏర్పాటుచేసి పార్టీపరంగా మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడానికి టీజెఎస్ సిద్దమవుతోంది. 

సంబంధిత వార్తలు


కాంగ్రెస్‌ పార్టీకి అందుకోసమే అల్టిమేటం జారీ చేశాం: కోదండరాం

కేసీఆర్ కు పాలించడం చేతకాక నాలుగున్నరేళ్లకే దిగిపోతానంటున్నారు : కోదండరాం

తెలంగాణ భవన్ కిరాయికి ఇవ్వాలి : కోదండరాం చురకలు

కోదండరాం జన సమితికి బిసి దెబ్బ (వీడియో)

 

Follow Us:
Download App:
  • android
  • ios