చలిలో తెలంగాణ స్పీకర్ ఏం చేస్తున్నారంటే ? (వీడియో)

First Published 28, Dec 2017, 5:48 PM IST
telangana speaker madhusudana chary visit villages
Highlights
  • ఎముకలు కొరికే చలిలోనూ పల్లెనిద్ర చేసిన స్పీకర్ మధుసూదనాచారి
  • గ్రామాల్లో చాయ్ తాగుతూ మాటా మంతి

చలి తీవ్రత పెరిగిపోయింది. చలి తాకిడికి తెలంగాణ రాష్ట్రం వణికిపోతున్నది. కానీ ఆ చలిని లెక్కచేయకుండా స్పీకర్ మధుసూదనాచారి పల్లె నిద్ర చేశారు. గ్రామాల్లో పొద్దున్నే లేచి పండ్లపుల్ల వేసుకుని పండ్లు తోముకుని చలిమంటల దగ్గర చాయి తాగి గ్రామాల్లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

భూపాలపల్లి జయశంకర్ జిల్లా లోని ఘనపూర్ మండలం కర్కపల్లి లో "పల్లె ప్రగతి నిద్ర " చేశారు స్పీకర్ ఎస్ మధుసూదన చారి. పల్లెనిద్రలో భాగంగా ఉదయం ఎస్సీ కాలనిలో పర్యటించి., సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పీకర్ చలిమంట దగ్గర చాయి తాగడం హాట్ టాపిక్ అయింది.

స్పీకర్ చలిలో పర్యటన ఎలా సాగిందో మీరూ ఈ కింది వీడియోలో చూడొచ్చు.

loader