జీహెచ్ఎంసీలో కరోనా జోరు: తెలంగాణలో కోవిడ్ కేసులు 5,56,320కి చేరిక
తెలంగాణా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,043 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,56,320కి చేరుకొంది. కరోనాతో గత 24 గంటల వ్యవధిలో 21 మంది మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,146కి చేరుకొంది.
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,043 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,56,320కి చేరుకొంది. కరోనాతో గత 24 గంటల వ్యవధిలో 21 మంది మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,146కి చేరుకొంది.
also read:కరోనాపై ద్విముఖ వ్యూహం: కేసీఆర్
గత 24 గంటల వ్యవధిలో 56,709 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 3,043 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ప్రస్తుతం 39,206 కరోనా యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. .గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4,693 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,13,968కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 424 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ఖమ్మంలో 198, మేడ్చల్‌లో 185, రంగారెడ్డిలో 165, కరీంనగర్ 162, నల్లగొండ 159, సూర్యాపేటలో 130 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ విధించింది. కరోనా కేసులను 5 శాతం వరకు తగ్గిస్తేనే కరోనాపై విజయం సాధించినట్టేనని సీఎం కేసీఆర్ సోమవారం నాడు నిర్వహించిన సమీక్షలో అభిప్రాయపడ్డారు.