క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ గుజరాత్ అరెస్ట్: హైద్రాబాద్ తీసుకు రానున్న పోలీసులు
దేశంలో క్రికెట్ బెట్టింగ్ ల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్న అమిత్ గుజరాత్ ను పోలీసులు పీటీ వారంట్ పై హైద్రాబాద్ కు తీసుకు రానున్నారు.
హైదరాబాద్:క్రికెట్ బెట్టింగ్ డాన్ Amit Gujarat ను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ లు నిర్వహించారని అమిత్ గుజరాత్ పై ఆరోపణలున్నాయి. అమిత్ ను Hyderabad పోలీసులు పీటీ వారంట్ పై హైద్రాబాద్ కు తీసుకు రానున్నారు.అమిత్ కు Cricket Betting ల నిర్వహణకు సంబంధించి నెట్ వర్క్ ఉందని పోలీసులు చెబుతున్నారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అమిత్ గుజరాతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్ లో ఆన్ లైన్ క్యాసినో నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గతంలో రెండుసార్లు అమిత్ గుజరాత్ అరెస్ట్ అయ్యాడు. దేశ వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ లు నిర్వహిస్తున్నాడు అమిత్. క్రికెట్ బెట్టింగ్ ల కోసం అమిత్ గుజరాత్ లైవ్ బాక్స్ ఉపయోగిస్తున్నాడు. ఈ బాక్స్ లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. క్రికెట్ బెట్టింగ్ ల పేరుతో అమిత్ గుజరాత్ కోట్లు కొల్లగొట్టాడని పోలీసులు చెబుతున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 6న హైద్రాబాద్ లోని Rachakonda పోలీసులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు.ఆన్‌లైన్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్న మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరంలో ఓ ముఠా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతోంది. ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసు బృందం బెట్టింగ్ ముఠా వ్యవహారాలను రట్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్ ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు నిర్వాహకులు, ఒక అకౌంటెంట్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం బెట్టింగ్ నిర్వహిస్తున్న ఈ ఏడు మందిపై కేసు నమోదుచేశారు.
ఆన్‌లైన్‌లో IPL క్రికెట్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్న ఈ ముఠా నుంచి పోలీసులు రూ.43 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వారివద్ద నుంచి ఒక ల్యాప్ టాప్, ఒక మారుతీ కారు, రెండు మోటార్ సైకిళ్లు, 9 సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం వస్తువుల విలువ రూ 56,00,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఐపీఎల్ క్రికెట్ ఆన్‌లైన్ బెట్టింగ్ పై కేసు నమోదుచేసుకున్నామనీ, దీనిపై విచారణ జరుగుతున్నదని తెలిపారు.
ఆన్‌లైన్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్న ముఠా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారని తెలిపారు. ఈ బెట్టింగ్ ముఠాలో ప్రధాన సూత్రధారి సాయిరామ్ వర్మ అని తెలిపారు. పుదుచ్చేరి, యానం ప్రాంతాల్లోనూ బెట్టింగ్ మూఠా కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. మరో ముఖ్య సూత్రధారి నాగరాజు.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందినవారని తెలిపారు. అయితే, ఇతను Hyderabad లోని వనస్థలిపురంలోని ఓ అపార్టుమెంట్ లో నివాసముంటున్నాడు. మరో నిందితుడు సింగరాయ్ కొండకు చెందిన వాడని తెలిపారు. ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీం పక్కా సమాచారంతో నిఘా పెట్టి వారిని అరెస్టు చేసింది.