దొంగల పుకార్లపై తెలంగాణ పోలీస్ సూపర్ సాంగ్ (వీడియో)

telangana police super song
Highlights

వైరల్ వీడియో

ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో దొంగలొస్తున్నారని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మనుషులను తినేవారు వస్తున్నారని భయపడుతున్నారు. పిల్లలను ఎత్తుకుపోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మెదడు తినే వారు తిరుగుతున్నారు జాగ్రత్త అంటూ సోషల్ మీడియా పోటెత్తుతున్నది.
అంతేకాదు వీళ్లే దొంగలు అని.. వీళ్లే పిల్లలను ఎత్తుకుపోతున్నారని.. వీళ్లే మనుషులను చంపి తింటారని ఇలాంటి ఆరోపణలతో కొంతమందిని జనాలు ఏకమై కొట్టి చంపుతున్న దాఖలాలున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ పుకార్లు నమ్మవద్దని తెలంగాణకు చెందిన ఒక పోలీసు అధికారి అద్బుతమైన పాటను పాడారు. ఇంతకాలం దొంగల గురించి పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అయితే ఇప్పుడు ఈ పోలీసు పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ చూడండి వీడియో.. వినండి పాట...

"

 

 

loader