విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) నేత, ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. విల్లా యజమానితో వివాదం కేసులో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. పీవీపీ కోసం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు విజయవాడకు చేరుకున్నారు. 

విజయవాడలోని హోటల్స్ లో, పీవీపీ సన్నిహితుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. విల్లా యజమానితో ఉన్న వివాదం కేసులో పీవీపీని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసును జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. 

Also Read: పీవీపీకి హై కోర్టులో ఊరట: ముందస్తు బెయిల్ మంజూరు

తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పీవీపీని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. పక్కన ఉన్న భవనం యజమానిపై దౌర్జన్యం చేసి వారి ఇంట్లోకి తన మనుషులతో అక్రమంగా చొరబడి దౌర్జన్యం చేశారనే ఆరోపణపై పీవీపీ మీద కేసు నమోదైంది. 

హైకోర్టు ఉత్తర్వులకు ముందు అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసుల మీదికి పీవీపీ కుక్కలను వదిలారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఇంటిని నిర్మాణాన్ని అడ్డుకుని పీవీపీ దౌర్జన్యం చేశారని పీవీపీపై ఓ విల్లా యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Also Read: పోలీసులపై దాష్టీకం.. అరెస్ట్ చేయడానికొస్తే కుక్కలను వదిలిన పీవీపీ