Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణా టిడిపిలోకి కొత్తోళ్లు రావట్లేదు. అందుకని....

పాత  సభ్యులను  రెనివల్ చేసేస్తే సరిపోతుందని టిడిపినాయకత్వం అనుంటూ ఉందట

Telangana people not interested to join TDP

ఇప్పుడే అందిన సమాచారం.

 

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కొత్త వాళ్లెవరూ ముందుకు రావడంలేదు. అందుకనీ...పాత  సభ్యులను రెనివల్ చేసేస్తే సరిపోతుందని టిడిపినాయకత్వం అనుంటూ ఉందట.  ఈ లెక్కన డ్రై వ్ ముగిసేనాటికి  కనీసం 8 లక్షల మంది సభ్యలయినా మిగులుతారని పార్టీ నమ్మకం.

 

 2014లో మెంబర్షిప్ డ్రైవ్ జరిపినపుడు నమోదయిన సభ్యులు 8 లక్షలు. అపుడు,  ఆంద్రోళ్ల పార్టీగా ముద్రేసి తెలంగాణా నుంచి తరిమేయాలనుకున్నా మాకింకా ఎనిమిది లక్షల సభ్యత్వం ఉంది అని చెప్పుకునేందుకు వీలవుతుందని టిడిపి నాయకత్వం అలోచన. అందువల్ల గుట్టుగా పాత సభ్యత్వం పుస్తకాలు పట్టుకుని పట పట రెనివల్ చేస్తున్నారట.

 

ఈ సీజన్ సభ్యత్వ నమోద క్యాంపెయిన్ లో ఇప్పటికదాకా 5.93 లక్షల మంది నమోదచేయించకున్నారట.అంటే రెనివల్ అన్నమాట.

 

ఈ సీజన్ లో 15 లక్షల మంది కొత్తగా చేర్పించాలన్నది పార్టీ నేత లోకేశ్ బాబు పెట్టిన లక్ష్యం.  అయితే, ఇది సాధ్యమయ్యేలా లేదు.

 

అందువల్ల ముమ్మర రెనివల్ కార్యక్రమంలో  టిడిపి నాయకులు పడిపోయారు.

 

రెనివల్ ఎలా ఉంది అని అడిగితే...

 

రాష్ట్రంలో టిఆర్ ఎస్ పాలనలో ప్రతికూల వాతావరణం ఉన్నా,   2014 లో సభ్యత్వం తీసుకున్నవారంతా ఉత్సహంగా మొక్కవోని ధైర్యంతో రెనివల్ చేయించుకునేందుకు ముందుకొస్తున్నారని ఒక నాయకుడు వ్యాఖ్యాణించారు.

 

అయితే, ఆంధ్ర కాలనీలు ఎకువగా ఉండే హైదరాబాద్ మహానగరంలో పరిస్థితి ఏమీ బాగుండటం లేదని చెబుతున్నారు. కొత్తవాళ్లు చేరడం లేదు, పాతవాళ్లు ముందుకు రావడం లేదని విశ్వసనీయంగా తెలిసింది.

 

అంతకలిపి గ్రేటర్ పరిథిలో టిడిపిలో చేరింది 58,241  మందేనట.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios