హైదరాబాద్:మున్సిపల్  ఎన్నికల బరిలో అభ్యర్థులను నిలిపెందుకు విపక్ష పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. పట్టణ ప్రాంత ఎన్నికలు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా పట్టణాల్లో తన పట్టును నిరూపించుకునేందుకు ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్నాయి.

Also read: వీక్లీ రౌండప్: మంత్రుల మెడకు మున్సిపల్ ఉచ్చు, కేటీఆర్‌కు సీఎం పదవి?

 ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి కూడా విపక్ష పార్టీలు ప్రభ్యత్వ విధానాన్ని తప్పు పడుతున్నాయి.ఆదరా బాదరాగా షెడ్యూల్ వెలువరించి ఎన్నికలకు వెళ్లడం పై ప్రభుత్వ తీరును తప్పుబడుతూ  కాంగ్రెస్‌పార్టీ  కోర్టుకు కూడా వెళ్లింది మరోవైపు అంతే వేగంగా ప్రభుత్వపరంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది..  రిజర్వేషన్లు ఖరారయ్యాయి. సోమవారం నోటిఫికేషన్ కూడా వెలువడనుంది.

Also read:వీక్లీ రౌండప్:దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం, కరీంనగర్ కలెక్టర్‌ బదిలీ

నోటిఫికేషన్ అనంతరం పోలింగ్ కు 15 రోజుల గడువు మాత్రమే ఉంటుంది. ఈ ప్రక్రియలో అభ్యర్థుల ఎంపిక కీలకం కావడంతో అభ్యర్థుల ఎంపిక నుంచే పొలిటికల్ హీట్ మొదలవుతుంది.

Also read: సీఎంగా కేటీఆర్: ప్లాన్ రెడీ,కేసీఆర్ భవిష్యత్తు ఆచరణ ఇదీ?

 అధికార పార్టీలో అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది.  ఉద్యమ నేతలు, వలస నేతలు అన్ని వార్డుల్లో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. పోటీ పడుతున్న నేతలను  బుజ్జగించడం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది.

also read:తెలంగాణ ఎన్నికల సంఘానికి హైకోర్టు షాక్: మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్ 

అయితే  విపక్ష పార్టీల్లో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. రిజర్వేషన్ల ప్రకారం  అభ్యర్థులను వెతుక్కోవడం, ఖరారు చేయడానికి అతి తక్కువ సమయం మాత్రమే ఉండడంతో విపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేశాయి.

also read: తెరపైకి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్: కేటీఆర్‌కు సీఎం పదవి?

ప్రతిపక్ష పార్టీ లో వార్డుల వారీగా అభ్యర్థులను ఖరారు చేయడమే విపక్ష పార్టీలకు తొలి పరీక్షగా నిలుస్తోంది.నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే నాటికి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నువ్వు పూర్తిచేస్తే ఆ తర్వాత ప్రచార నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని నేతలు భావిస్తున్నారు