తెరపైకి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్: కేటీఆర్‌కు సీఎం పదవి?

తెలంగాణకు కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అవుతారని టీఆర్ఎష్ నేతలు చెబుతున్నారు. కేటీఆర్ కు సీఎం పదవిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Support for KTR as next CM gets stronger

హైదరాబాద్:తెలంగాణలో అధికార పార్టీలో రాజకీయం ఆసక్తి రేపుతోంది  కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది.మరో సీనియర్ నేత మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఆదివారం కేటీఆర్ ను సీఎం చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు.

Also read: వీక్లీ రౌండప్: మంత్రుల మెడకు మున్సిపల్ ఉచ్చు, కేటీఆర్‌కు సీఎం పదవి?

 ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ తన సమర్థతను నిరూపించుకున్నారని ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినా సమర్థవంతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Also read:వీక్లీ రౌండప్:దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం, కరీంనగర్ కలెక్టర్‌ బదిలీ

 ఉద్యమ సమయంలో  కీలకంగా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్న కేటీఆర్... ముఖ్యమంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడని నేతలు ఒక్కకొక్కరు  చెబుతున్నారు. పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు  అయినా చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది.

Also read:రాజధాని రాజకీయం: అమరావతి భవితపై ఆందోళన, ముంచుతారా తేల్చుతారా?

 ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు పదవీ బాధ్యతలు అప్పగించేందుకు ఇదే సరైన సమయమని సీనియర్ నేతలు అంటున్నారు. మరో 4 ఏళ్ళ వరకు ఎన్నికలు లేకపోవడంతో పాలనపై పూర్తిస్థాయిలో కేటీఆర్  దృష్టి సారిస్తారని రాబోయే రోజుల్లో సుదీర్ఘకాలంగా రాష్ట్రానికి సేవలు అందించే అవకాశం కేటీఆర్ కు కలుగుతుందని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

 అయితే కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెటితే సీఎం కేసీఆర్  జాతీయ రాజకీయాల్లో  ఉంటారన్న ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ ను తెరపైకి తెచ్చిన కేసీఆర్ , బిజెపి కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ సాధించడంతో  ఫ్రంట్ అంశం తెరమరుగైంది. 

 ఇటీవల వెలువడుతున్న ఫలితాలతో బిజెపి బలహీనపడుతున్న సంకేతాల నేపథ్యంలో మరి కొన్ని రోజుల తర్వాత ఫెడరల్ ఫ్రంట్ నినాదాన్ని కెసిఆర్ మరో సారి తెరపైకి తెచ్చే అవకశాలు ఉన్నాయన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios