Asianet News TeluguAsianet News Telugu

విమర్శలు కాదు.. మాతో కలిసి పనిచేయండి: కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్న రెండు జాతీయ పార్టీలు.. వారి అధిష్టానాలు, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోతిరెడ్డిపాడును అడ్డుకునే ప్రయత్నం  చేయాలని లేనిపక్షంలో అర్ధం లేని విమర్శలు మానుకోవాలని నిరంజన్ రెడ్డి హితవు పలికారు

telangana Minister Niranjan reddy press meet in Mahabubnagar on Pothireddypadu Lift irrigation
Author
Hyderabad, First Published May 15, 2020, 7:19 PM IST

కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. మహబూబ్‌నగర్ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పోతిరెడ్డిపాడు విషయంలో రాజకీయ విమర్శలకు పోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని ఆయన హితవు పలికారు.

టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్న రెండు జాతీయ పార్టీలు.. వారి అధిష్టానాలు, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోతిరెడ్డిపాడును అడ్డుకునే ప్రయత్నం  చేయాలని లేనిపక్షంలో అర్ధం లేని విమర్శలు మానుకోవాలని నిరంజన్ రెడ్డి హితవు పలికారు.

Also Read:జగన్ ఎఫెక్ట్: గోదావరి జలాలపై ఈ నెల 17న మంత్రులతో కేసీఆర్ భేటీ

ప్రపంచంలోనే అతిపెద్దదైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు కేసులు వేసింది ఎవరని మంత్రి నిలదీశారు. స్వరాష్ట్రంలో ప్రాజెక్ట్‌లపై కేసులు వేసిన ప్రతిపక్షనేతలు ఏపీ అక్రమ ప్రాజెక్ట్‌లపై ఒక్క కేసైనా వేశారా అని ఆయన ప్రశ్నించారు.

పోతిరెడ్డిపాడును అడ్డుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్ట్‌ల ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విషయంలో సీఎం కేసీఆర్‌పై పూర్తి విశ్వాసం ఉందని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.

Also Read:కరోనా పరీక్షలు: తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నది ఇదీ...

శ్రీశైలం నుంచి ప్రతిరోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని చేపట్టడాన్ని అడ్డుకుంటామని  మరో మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ  తింటుంటే అన్ని పార్టీలు ఏకం కావాలని.. ఈ విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios