హైదరాబాద్: పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంటే తెలంగాణ ప్రభుత్వం గోదావరి నది జలాల వినియోగంపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గోదావరి పరివాహ ప్రాంతంలోని మంత్రులతో సీఎం కేసీఆర్ ఈ నెల 17వ తేదీన సమావేశం కానున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుండి పోతిరెడ్డి పాడు ద్వారా 80 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం 203 జీవోను జారీ చేసింది.ఈ జీవోపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. 

also read:పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదుకు ఏపీ రె'ఢీ'

ఈ వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను వినియోగించుకొనేందుకు ప్రణాళిక రూపొందించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటల నుండి  సాయంత్రం వరకు సమావేశం నిర్వహించనున్నారు. 

 గోదావరి ప్రాజెక్టుల నుంచి ఈ వర్షాకాలంలో నీరు ఎప్పుడు ఎంత విడుదల చేయాలి?ఎస్ఆర్ఎస్‌పీ, ఎల్ఎండిలకు నీళ్లు ఎప్పుడు, ఎంత తరలించాలి? మిగతా రిజర్వాయర్లకు ఎప్పుడు తరలించాలి? నీటిని ఎలా వాడుకోవాలి? తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృత చర్చ జరుగుతుంది. 

also read:పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదుకు ఏపీ రె'ఢీ'

ఈ సమావేశానికి గోదావరి నది పరివాహక జిల్లాల మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, కెటి రామారావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డిలను ఆహ్వానించారు. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇఎన్సి మురళీధర్, ఎస్సారెస్పీ సిఇ శంకర్, కాళేశ్వరం సిఇ వెంకటేశ్వర్లు, ఇతర సీనియర్ నీటి పారుదల ఇంజనీర్లను ఆహ్వానించారు.