Asianet News TeluguAsianet News Telugu

పెయింటర్ రేవంత్ కు ఇన్ని కోట్ల ఆస్తులా ?

  • నువ్వు గజదొంగవు
  • పిట్టల దొరవు
  • పెద్ద జోకర్ వు
Telangana minister laxmareddy fire on congress revanth

కాంగ్రెస్ నేత రేవంత్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి అవంచ లక్ష్మారెడ్డి. పాలమూరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు వి .శ్రీనివాస్ గౌడ్ ,మర్రి జనార్దన్ రెడ్డి ,ఎ .వెంకటేశ్వర్ రెడ్డి లతో కలిసి ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. లక్ష్మారెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే చదవుదాం.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఓ జోకర్ లా మారిపోయిండు. వ్యక్తి గత విమర్శల జోలికి వెళితే ఖబడ్దార్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఓ పిట్టల దొర ,పెద్ద దొంగ. నేను బాజాప్తా రియల్ ఎస్టేట్ వ్యాపారినే. మా కుటుంబానికి మా ప్రాంతంలో ఓ చరిత్ర ఉంది. గోడల మీద రంగులు వేసుకుని బతికిన రేవంత్ కు ఇన్ని కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలి. నన్ను మున్నాభాయ్ అంటున్న రేవంత్ రెడ్డే శోభ రాజ్ లాంటి గజ దొంగ . మున్నాభాయ్ పాత్ర ఆ సినిమా లో మంచిదే. రేవంత్ లా దొంగది కాదు. ఇకముందు మా మీద వ్యక్తిగత విమర్శలు మానుకుంటే మంచిది.

జడ్చర్ల జనగర్జన పేరిట కాంగ్రెస్ సమావేశం కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా ఉంది . నెల రోజులుగా ఆ సభకు ఏర్పాట్లు చేసినా అట్టర్ ఫ్లాప్ అయింది . 30 వేల మంది హాజరవుతారని గొప్పలు చెప్పుకున్నారు. 3వేల మంది కూడా హాజరు కాలేదు. పాలమూరు జనాలు కాంగ్రెస్ ను ఛీ కొడుతున్నారని ఈ సభతో నిరూపితమైంది. జాతీయ అంతార్జాతీయ నాయకులు సభకు హాజరైనా జనం సభ ను పట్టించుకోలేదు. తెలంగాణ కు కాంగ్రెస్ పీడ విరుగడైందని జనం భావిస్తున్నారు. కనుచూపు మేరలో కాంగ్రెస్ కు అధికారం వచ్చే పరిస్థితి లేదు.

ఉద్యమం లో దొంగల్లా తప్పించుకు తిరిగిన కాంగ్రెస్ నేతలు ఇపుడు తెలంగాణ గురించి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. అభివృద్ధి గురించి స్కామ్ గ్రెస్ నేతలా మాట్లాడేది? తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కి జాతీయ అంతర్జాతీయం గా ప్రశంసలు వస్తున్నాయి. పాపం కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదు . పాలమూరు ప్రాజెక్టులు అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య హాయంలో ప్రారంభమయ్యాయని సిగ్గు లేని వెధవలు ,సన్నాసుల్లా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. అంజయ్య హయాంలో ప్రాజెక్టులు మొదలయితే వాటి పూర్తికి మిగతా కాంగ్రెస్ సీఎం లు ఏం చేసినట్టు ? ఎన్నికల నాటికి మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతాం.

కుటుంబ పార్టీ అయిన కాంగ్రెస్ వాళ్లు టిఆర్ఎస్ గురించా మాట్లాడేది ? మంత్రులకు స్వేచ్ఛ లేదని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదం. మంత్రులు గా ఉన్నపుడు తాగి పేకాట ఆడి ప్రజల గురించి పట్టించుకోని కాంగ్రెస్ నేతలా మా గురించి మాట్లేడేది ? బంగారు తెలంగాణ గురించి మంత్రులమంతా చిత్త శుద్దితో పని చేస్తున్నాం. జడ్చర్ల సభకు మూడు వేలకు మించి జనం వచ్చారు అని నిరూపిస్తె దేనికైనా సిద్ధం..

 

Follow Us:
Download App:
  • android
  • ios