హైదరాబాద్: మా బావ హరీష్‌రావుకు నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవని  మంత్రి కేటీఆర్  చెప్పారు.

సోమవారం నాడు మంత్రి కేటీఆర్  ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ సంచలన విషయాలను వెల్లడించారు.హరీష్‌కు నాకు గ్యాప్  ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. 

Also read:సీఎంగా కేటీఆర్: ప్లాన్ రెడీ,కేసీఆర్ భవిష్యత్తు ఆచరణ ఇదీ?

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రచారం చేయరని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను సిరిసిల్ల జిల్లాకు మాత్రమే పరిమితం కానున్నట్టుగా ఆయన చెప్పారు.

also read:తెలంగాణ ఎన్నికల సంఘానికి హైకోర్టు షాక్: మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్ 

రాష్ట్రంలోని 130 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను  టీఆర్ఎస్ కైవసం చేసుకొంటుందని మంత్రి కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.  అన్ని మున్సిపాలిటీలు,కార్పోరేషన్లను కైవసం చేసుకొని రికార్డు సృష్టిస్తామని ఆయన చెప్పారు.

also read: తెరపైకి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్: కేటీఆర్‌కు సీఎం పదవి? 

Also read: వీక్లీ రౌండప్: మంత్రుల మెడకు మున్సిపల్ ఉచ్చు, కేటీఆర్‌కు సీఎం పదవి?

తాను సీఎం కాబోతున్నారనే  ప్రచరాం తమ పార్టీలో కొత్త కాదన్నారు ఇది మీడియా ప్రచారం మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు.  పార్టీలో కవితకు సముచిత స్థానం ఉంటుందని కేటీఆర్ తేల్చి చెప్పారు.

కొంత కాలంగా కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తారని ప్రచారం సాగుతోంది. మరో పదేళ్ల పాటు కేసీఆర్ సీఎంగా ఉంటారని కూడ కేటీఆర్ గతంలోనే ప్రకటించారు. ఇవాళ్టి ఇంటర్వ్యూలో కూడ కేటీఆర్  ఈ విషయాన్ని  కుండబద్దలు కొట్టారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కవితకు సముచిత స్థానాన్ని కట్టబెట్టనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. అయితే కవితకు ఏ పదవిని ఇస్తారనే విషయమై ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.