Hyderabad: తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2023 మేలో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 20 నాటికి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని సంబంధిత అధికారుల నుంచి సమాచారం అందింది.
Telangana Intermediate exams results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2023 మేలో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 20 నాటికి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని సంబంధిత అధికారుల నుంచి సమాచారం అందింది.
వివరాల్లోకెళ్తే.. తెంలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి (టీఎస్ బీఐఈ) మే రెండు లేదా మూడో వారంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేయనుంది. 2023 సంవత్సరానికి ఇంటర్ పరీక్షలు 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 15 శిబిరాల్లో జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైందనీ, 2023 ఏప్రిల్ 20 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,82,677 మంది పరీక్షలు రాశారు. అలాగే, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,65,022 మంది పరీక్షలు రాశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించని వారు 2023 మే చివరి వారంలో నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చునని సంబంధిత అధికారులు తెలిపారు.
జవాబు పత్రాల ఆన్ స్క్రీన్ డిజిటల్ మూల్యాంకనాన్ని టీఎస్ బీఐఈ ప్రతిపాదించినప్పటికీ ఆ తర్వాత ఆ ప్రణాళికను విరమించుకుని సంప్రదాయ మూల్యాంకన విధానాన్ని కొనసాగించింది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2023 తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. (లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). అభ్యర్థులు తమ రోల్ నంబర్, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయడం ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.
