సినీనటుడు శివబాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందించింది. మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్‌ యాజమాన్యం తీరుపై హెచ్ఆర్సీనీ ఆశ్రయించారు శివబాలాజీ. ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

మౌంట్ లిటేరాజీ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీ అధికారులను ఆదేశించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈవోకి నోటీసులు ఇచ్చింది. 

Also Read:మీరు క్లాసులు తీసుకోవడం కాదు.. నేను మీకు తీసుకుంటాః శివబాలాజీ ఫైర్‌

అంతకుముందు మౌంట్ లిటేరాజీ బలవంతంగా ఫీజు వసూలు చేస్తోందని, గవర్నమెంట్ ఆదేశాలను బేఖాతర్ చేస్తోందని శివబాలాజీ ఆరోపించారు. ఫీజు వసూలు కోసం అనవసర పరీక్షలు కూడా నిర్వహిస్తోందని వ్యాఖ్యానించారు.

ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పకుండా ఐడీ బ్లాక్ చేస్తుందని, ఎదురు తిరిగి అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని శివబాలాజీ వాపోయారు.