విద్య వ్యాపారమైపోయింది. డబ్బు ఉంటేనే ఖరీదైన చదువు అనేలా తయారైంది. కార్పొరేట్‌ స్కూల్స్ లో విద్య పేరుతో సాగే వ్యాపారం గురించి ఎంత చెప్పినా తక్కువే. నిలువుదోపిడి అని చెప్పొచ్చు. సంపన్నులు ఎంత లక్షలైనా పెట్టి చదవించగలరు. కానీ పేద వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ప్రభుత్వం స్కూల్స్ సరైనా వసతులుండవు, నాణ్యమైన విద్య దొరకదు. ప్రైవేట్‌కి వెళ్ళితే డబ్బు కట్టలేని పరిస్థితి. 

ప్రైవేట్‌ స్కూల్స్ లో దోపిడిపై నటుడు శివబాలాజీ ఫైర్‌ అయ్యారు. మణికొండలోని మౌంట్‌ లిటేరా జీ స్కూల్‌ తీరుపై బాలాజీ ఘాటుగా మండిపడ్డారు. స్కూల్‌పై మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ, మౌంట్‌ లిటేరా జీ స్కూల్‌ బలవంతంగా ఫీజులు వసూలు చేసిందని, ప్రభుత్వ ఆదేశాలను సైతం బేఖాతర్‌ చేస్తుందని ఆరోపించారు. ఎనిమిదేళ్ళుగా తమ పెద్దబ్బాయి ఆ స్కూల్‌లోనే చదవిస్తున్నామని, ఏ రోజు ఫీజుల విషయంలో ఇబ్బందిలేదు. కానీ ఈ సారి దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ఫీజు వసూలు కోసం అనవసర పరీక్షలు కూడా నిర్వహిస్తోందన్నారు. ఎవరైనా ఫీజులపై ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని, పిల్లలకు ఆన్‌ లైన్‌ క్లాసులు చెప్పకుండా ఐడీ బ్లాక్‌ చేస్తున్నారని, వారి ఆగడాలను ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో చాలా మంది పేరెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం వారంతా ఓ టీమ్‌గా ఫామ్‌ అయి స్కూల్‌ యాజమాన్యాన్ని కలవాలని చూస్తున్నారు. కానీ కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదు. వారు మా సపోర్ట్ కోరారు. అందుకోసం మేం యాజమాన్యాన్ని సంప్రదించినా స్పందించడం లేదు, పైగా బెదిరింపులకు దిగుతున్నారు. ఈ సందర్బంగా వారిని చెప్పేది ఒక్కటే.. `మీరు పిల్లలకు క్లాస్‌లు తీసుకోవడం కాదు, మీకు నేను క్లాసులు తీసుకుంటా`నని హెచ్చరించారు. 

లాయర్‌ మాట్లాడుతూ, `మరో రెండు రోజుల్లో పరీక్షలున్న సందర్భంగా ఫీజుకు సంబంధించి ఎలాంటి నోటీసులు లేకుండా ఆన్‌లైన్‌ క్లాసులను కట్‌ చేస్తున్నారు. ఈ పేరెంట్‌గా శివబాలాజీ ఆ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. స్కూల్‌ యాజమాన్యం ఈ చర్యల వల్ల విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. ఒత్తిడికి గురవుతున్నారు.