తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్, జూలై 1న ఈసెట్, జూన్ 20న టీఎస్ పీజీఈసెట్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఉన్నత విద్యా మండలి ఓ  ప్రకటనలో తెలిపింది.

ఇంటర్ ఫస్టియర్ పూర్తి సిలబస్, రెండో సంవత్సరంలో 70 శాతం సిలబస్ మాత్రమే ఎంసెట్ నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ గతంలోనే ప్రకటించింది. ఎంసెట్ పరీక్షల్లో చాయిస్ పెంచుతామని విద్యాశాఖ తెలిపింది.

Also Read:జూన్ 14 తర్వాత ఎంసెట్: తెలంగాణ విద్యాశాఖ

ఇంటర్ వెయిటేజ్ ఎంసెట్ లో ఉంటుందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఎంసెట్ ర్యాంకుల్లో  ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకొంటారు.