హైదరాబాద్: ఈ ఏడాది జూన్ 14 తర్వాత ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టుగా తెలంగాణ విద్యాశాఖ శుక్రవారం నాడు ప్రకటించింది.ఇంటర్ ఫస్టియర్ పూర్తి సిలబస్, రెండో సంవత్సరంలో 70 శాతం సిలబస్ మాత్రమే ఎంసెట్ నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది.

also read:తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

 

ఇంటర్ లో 70 శాతం సిలబస్ వరకే పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది.ఎంసెట్ పరీక్షల్లో చాయిస్ పెంచుతామని విద్యాశాఖ తెలిపింది.ఇంటర్ వెయిటేజ్ ఎంసెట్ లో ఉంటుందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఎంసెట్ ర్యాంకుల్లో  ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకొంటారు. 

also read:ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుండి రాష్ట్రంలో విద్యా సంస్థలు సరిగా నడవలేదు. ఆన్ లైన్ క్లాసులపైనే ఎక్కువగా విద్యార్ధులు ఆధారపడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుండి విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. 9 నుండి ఆ పై తరగతులకు మాత్రమే విద్యాసంస్థల్లో విద్యాబోధనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

పరీక్షల షెడ్యూల్ ను కూడ విద్యా శాఖ ప్రకటించింది. మే మాసంలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తైన తర్వాత ఎంసెట్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించనుంది.