కరోనాకు రూ. 4 లక్షలు వసూలు: ఏం చర్యలు తీసుకొన్నారన్న తెలంగాణ హైకోర్టు

గాంధీ ఆసుపత్రిలోనూ కరోనా టెస్టులు జరపాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 

Telangana high court orders to conduct corona tests in Gandhi hospital

హైదరాబాద్:గాంధీ ఆసుపత్రిలోనూ కరోనా టెస్టులు జరపాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మంగళవారం నాడు కరోనా టెస్టులు, చికిత్సలపై హైకోర్టులో విచారణ జరిగింది. గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ ఆసుపత్రిలో కూడ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. 

also read:అంత్యక్రియలైన 5 రోజులకు కరోనా నిర్ధారణ: ఫ్యామిలీ, గ్రామస్థుల్లో భయం

కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేట్ ఆసుపత్రులను నియంత్రించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.కరోనా రోగుల నుండి రూ. 4 లక్షలు వసూలు చేసిన యశోద, కిమ్స్ ఆసుపత్రులపై ఏం చర్యలు తీసుకొన్నారని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

also read:కోవిడ్ రూల్స్ బ్రేక్: మాస్క్ లేకుండా బోనాల ఉత్సవంలో పద్మారావు గౌడ్

కరోనా రోగులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలకు సంబంధించి అన్ని రకాల పరీక్షలకు గరిష్ట చార్జీలను ఖరారు చేయాలని హైకోర్టు సూచించింది.నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో కరోనా చికిత్సలు చేస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఈ నెల 27వ తేదీ లోపుగా నివేదికను అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

also read:కరోనా హెల్త్ బులిటెన్‌లో అరకొర సమాచారం: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా రోగులకు చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులను నిర్ణయించింది. అయితే ఈ ఫీజుల కంటే ఎక్కువ ఫీజులను ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. కరోనా చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరిన ఇద్దరు డాక్టర్లతో పాటు పలువురు సామాన్యులు కూడ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇద్దరు డాక్టర్లు సెల్పీ వీడియోల ద్వారా తమ ఆవేదనను బయటపెట్టారు.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios