హైదరాబాద్: కరోనా కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్ లో సరైన సమాచారం లేకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో తాము చేసిన సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదని హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.

కరోనా హెల్త్ బులెటిన్ విషయమై బుధవారం నాడు తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతి రోజూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న కరోనా హెల్త్ బులెటిన్‌లో  వార్డుల వారీగా సమాచారం లేదని హైకోర్టు ప్రశ్నించింది.

also read:కరోనా దెబ్బ: తెలంగాణలో డిగ్రీ ఆఢ్మిషన్స్ ప్రక్రియ వాయిదా

తమ ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కంటైన్మెంట్ విధానం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.  రాష్ట్రంలో కంటైన్మెంట్ విధానం ఏమిటని హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. కరోనా కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలను సమర్పించాలని కోరింది.కరోనా నిర్ధారణ పరీక్షలను నిలిపివేయడంపై కూడ కోర్టు అగ్రహం వ్యక్తం చేసింది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై కేంద్ర  బృందం ఇటీవలే పర్యటించింది. అయితే ఈ బృందం నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలను సమర్పించాలని కూడ ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం.

also read:సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ హరితహరంలో కరోనా కలకలం: హోంక్వారంటైన్‌లో పలువురు

ఈ నెల 17వ తేదీ లోపుగా సమగ్ర సమాచారాన్ని తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది . లేకపోతే ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరుకావాలని ఆదేశించింది.