కోవిడ్ రూల్స్ బ్రేక్: మాస్క్ లేకుండా బోనాల ఉత్సవంలో పద్మారావు గౌడ్
కరోనా నిబంధనలను తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఉల్లంఘించారు. తన నివాసం ముందుకు వచ్చిన ఫలలహారం బండి ఊరేగింపులో పద్మారావు మాస్క్ లేకుండా సోమవారం నాడు పాల్గొన్నారు.
హైదరాబాద్: కరోనా నిబంధనలను తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఉల్లంఘించారు. తన నివాసం ముందుకు వచ్చిన ఫలలహారం బండి ఊరేగింపులో పద్మారావు మాస్క్ లేకుండా సోమవారం నాడు పాల్గొన్నారు.
ఎవరి ఇంట్లో వారే అమ్మవారికి బోనాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. బహిరంగంగా బోనాల ఉత్సవాలను ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో ఈ నెల 12వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు భక్తులు లేకుండానే జరిగాయి. సంప్రదాయం ప్రకారంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు.
బోనాల ఉత్సవాల్లో భాగంగా ఫలహారం బండి ఊరేగింపులో మంగళవారం నాడు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. మాస్క్ లేకుండా, భౌతిక దూరం పాటించలేదు. కరోనా సోకిన పద్మారావు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత గత వారం రోజుల క్రితమే ఆయన ఇంటికి చేరుకొన్నాడు.
also readi:జీహెచ్ఎంసీలో తగ్గని ఉధృతి: తెలంగాణలో 36,221కి చేరిన కరోనా కేసులు
మాస్కు పెట్టుకోవాలని కోరినా కూడ ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడని సాక్షాత్తూ మంత్రి కేటీఆర్ ఇటీవల ఓ సమావేశంలో పద్మారావు గౌడ్ గురించి ప్రస్తావించాడు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో మాస్క్ పెట్టుకోవాలని తాను ఇచ్చిన కూడ పద్మారావు గౌడ్ మాస్క్ ను ధరించని విషయాన్ని కేటీఆర్ ఆ సమావేశంలో గుర్తు చేశారు. ఆ మరునాడే కరోనాతో పద్మారావు గౌడ్ ఆసుపత్రిలో చేరినట్టుగా మంత్రి గుర్తు చేసుకొన్నారు.