అంత్యక్రియలైన 5 రోజులకు కరోనా నిర్ధారణ: ఫ్యామిలీ, గ్రామస్థుల్లో భయం
: ఓ మహిళ మృతి చెందిన ఐదు రోజులకు కరోనా సోకినట్టుగా అధికారులు ప్రకటించారు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్టణం మండలం దండు మైలారం గ్రామంలో చోటు చేసుకొంది.
హైదరాబాద్: ఓ మహిళ మృతి చెందిన ఐదు రోజులకు కరోనా సోకినట్టుగా అధికారులు ప్రకటించారు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్టణం మండలం దండు మైలారం గ్రామంలో చోటు చేసుకొంది.
also read:కోవిడ్ రూల్స్ బ్రేక్: మాస్క్ లేకుండా బోనాల ఉత్సవంలో పద్మారావు గౌడ్
రంగారెడ్డి జిల్లాలోని దండు మైలారం గ్రామానికి చెందిన విజయబాయి అనే మహిళ వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. చికిత్స కోసం ఆమెను పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగింది. చార్మినార్ ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆమెను యశోదాతో పాటు బంజారాహిల్స్ లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఈ రెండు ఆసుపత్రుల్లో ఆమెకు చికిత్స చేయడానికి వైద్యులు నిరాకరించారు. దీంతో ఆమెను కుటుంబసభ్యులు గాంధీకి తరలించారు.
గాంధీ ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే ఆమె మరణించింది. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించాలని కుటుంబసభ్యులు కోరినా కూడ అవసరం లేదని వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంతోనే మరణించినందున కరోనా పరీక్షలు అవసరం లేదని వైద్యులు చెప్పారని ఫ్యామిలీ మెంబర్లు చెబుతున్నారు.
అనారోగ్యంతోనే మరణించిందనే ఉద్దేశ్యంతో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే చార్మినార్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్న సమయంలో ఆమె నుండి ఆసుపత్రి సిబ్బంది ఆమె నుండి శాంపిల్స్ సేకరించారు.ఈ పరీక్షల ఫలితాలు విజయబాయి అంత్యక్రియలు జరిగిన ఐదు రోజుల తర్వాత ఈ ఫలితాలు వచ్చాయి. ఈ రిపోర్టులో ఆమెకు కరోనా వచ్చిందని తేలింది.దీంతో కుటుంబసభ్యులు, అంత్యక్రియల్లో పాల్గొన్నవారితో పాటు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.