ఆ ప్రచారం నమ్మొద్దు.. కరోనా వైరస్ ఇలా వ్యాపిస్తుంది: మంత్రి ఈటల
కరోనా వైరస్ కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి కాబట్టి ప్రభుత్వపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.
కరోనా వైరస్ కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి కాబట్టి ప్రభుత్వపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా 88 వేలమందికి ఈ వ్యాధి సోకిందని.. వీరిలో ఒక్క చైనా నుంచే 80 వేలమంది ఉన్నారని ఈటల చెప్పారు. గతంలో సార్స్, స్వైన్‌ఫ్లూల కంటే కూడా కరోనా కారణంగా సంభవించిన మరణాలు తక్కువేనని ఆయన స్పష్టం చేశారు.
కరోనాపై సోషల్ మీడియాలో వస్తున్న అపోహలు, తప్పుడు వార్తలు, దుష్ప్రచారాలు నమ్మొద్దని ఈటల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పుడు కూడా ఇలాగే ప్రచారం జరిగిందని కానీ మరణాలు సంభవించలేదని మంత్రి గుర్తుచేశారు.
Also Read:కరోనా వైరస్: ప్రతి వందేళ్లకోసారి మానవాళిని వణికిస్తున్న "మహా"మ్మారి వ్యాధి.
బస్సులో, ఫ్లైట్‌లో, క్లాస్‌లో, రైళ్లో వ్యాపిస్తుందని ప్రచారం జరుగుతోందని కానీ ఇది తప్పన్నారు. కరోనా వైరస్ గాలి ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం లేదని కేవలం మనిషి నుంచి మనిషికి వచ్చే వ్యాధి మాత్రమేనన్నారు.
కరోనా సోకిన వ్యాక్తి నోటి వెంట వచ్చిన తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాధి సోకుంతుందన్నారు. వందల మంది గుమిగూడే బహిరంగ ప్రదేశాల్లో చేతి రుమాలు, మాస్క్‌ను వాడటంతో పాటు చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటే కరోనాను అరికట్టవచ్చని ఈటల చెప్పారు.
ప్రతీ సీజన్‌లోనూ జలుబు చేస్తుందని.. అంతమాత్రం చేత అది కరోనా వైరస్, సార్స్, స్వైన్ ఫ్లూ కాదన్న సంగతిని గుర్తించాలని ఈటల వెల్లడించారు. కరోనా వైరస్ సోకినప్పటికీ 81 శాతం మామూలు జలుబులాగానే తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
14 శాతం ట్రీట్‌మెంట్ తీసుకున్నవారికి కూడా కరోనా తగ్గిపోయిన దాఖలాలు ఉన్నాయని.. అయితే 3 శాతం మందికి మాత్రం రిస్క్ ఉంటుందని రాజేందర్ చెప్పారు. ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా జలుబు చేసినా వైద్యుడిని సంప్రదించడం మంచిదని ఈటల స్పష్టం చేశారు.
ఒకవేళ ఎవరిలోనైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే తోటి వారికి ఇది సోకకుండా జాగ్రత్త తీసుకోవాలని మంత్రి తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన టెక్కీకి కరోనా సోకింది తప్పించి.. తెలంగాణ వాసుల్లో ఎవరికి ఈ వ్యాధి సోకలేదని ఈటల స్పష్టం చేశారు.
Also Read:కరోనావైరస్ ఎఫెక్ట్: ఇంగ్లాండు క్రికెటర్ల సంచలన నిర్ణయం
కరోనా చికిత్స కోసం గాంధీ ఆసుపత్రి, మిలటరీ హాస్పిటల్, చెస్ట్, ఫీవర్ ఆసుపత్రులతో పాటు వికారాబాద్ హాస్పిటల్‌లో అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌తో పాటు సమీప ప్రాంతాల్లో ఉన్న మెడికల్ కాలేజీల్లో 200 బెడ్లను ఐసోలేషన్ కోసం, 50 బెడ్లను ట్రీట్‌మెంట్ కోసం ఏర్పాటు చేశామన్నారు.
కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌తో చర్చిస్తున్నట్లు ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణలో ఎండలు ఎక్కువవుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉండకపోవచ్చునని ఈటల అభిప్రాయపడ్డారు. క
రోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను ట్రాఫిక్ కూడళ్లు, సినిమా థియేటర్లు, రైల్వే, బస్టాండ్‌లలో ప్రచారాన్ని చేపట్టబోతున్నట్లు ఈటల తెలిపారు. 104 నెంబర్ కరోనా హెల్ప్‌లైన్‌గా ప్రకటించామని మంత్రి చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాలకు కొద్ది రోజుల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.