సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక హెచ్చరికలు చేసింది. రాష్ట్రంలో గడిచిన 4 వారాల నుంచి కేసులు పెరుగుతున్నాయని తెలిపింది వైద్య ఆరోగ్య శాఖ.

మరో ఆరు వారాల పాటు  భారీగా కేసులు పెరుగుతాయని హెచ్చరించింది. ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా దొరకని ప్రమాదం వుందని పేర్కొంది. ప్రజలు సహకరించకపోతే మహారాష్ట్ర పరిస్ధితి రావొచ్చని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

ప్రస్తుతం వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపింది. మరో ఆరు వారాల పాటు భారీగా కేసులు పెరుగుతాయని హెచ్చరించింది. కరోనా నిబంధనలను అందరూ పాటించాలని సూచించింది. 

మరోవైపు రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై స్పందించారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 15-20 శాతం మంది ఆసుపత్రుల్లో చేరేవారని గుర్తుచేశారు.

Also Read:హైద్రాబాద్‌లో వ్యాక్సిన్ కు డిమాండ్: నిల్వలు లేక వెనుదిరుగుతన్న ప్రజలు

ఇప్పుడు 95 శాతం మంది లక్షణాలు లేకుండా వుంటున్నారని మంత్రి వెల్లడించారు. టిమ్స్‌లో ప్రస్తుతం 450 మంది రోగులు చికిత్స పొందుతున్నారని ... బెడ్స్, మందులు అందుబాటులో వున్నాయని రాజేందర్ పేర్కొన్నారు.

సిబ్బంది కొరత లేదని.. కొత్త వారిని తీసుకుంటున్నామని ఈటల చెప్పారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 14 వేల బెడ్స్ అందుబాటులో వున్నాయని.. ఎవరికైనా సీరియస్‌గా వుంటే గాంధీకి పంపిస్తున్నారని రాజేందర్ వెల్లడించారు.