ఫోన్ ట్యాప్ ఆరోపణలు: పోలీస్ అధికారి ప్రణీత్ రావుపై రేవంత్ సర్కార్ సస్పెన్షన్ వేటు
ఎస్ఐబీలో పనిచేసిన ప్రణీత్ రావుపై తెలంగాణ సర్కార్ వేటేసింది. ప్రణీత్ రావుపై గతంలో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: గతంలో స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ)లో డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ గా పనిచేసిన దుగ్యాల ప్రణీత్ రావును తెలంగాణ ప్రభుత్వం సోమవారంనాడు సస్పెండ్ చేసింది.ఈ మేరకు తెలంగాణ డీజీపీ రవిగుప్తా సోమవారంనాడు ఉత్తర్వులు జారీ చేశారు.
also read:కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవినీతి బంధం: సంగారెడ్డి బీజేపీ సభలో మోడీ
ప్రణీత్ రావు ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రణీత్ రావు ఎస్ఐబీలో డీఎస్పీగా పనిచేశారు. ఎస్ఐబీ ముసుగులో విపక్ష పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారని ప్రణీత్ రావుపై అప్పట్లో విపక్షాలు ఆరోపించాయి. అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొందరు పోలీస్ అధికారులపై ఆరోపణలు చేశారు.
also read:విశాఖపట్టణంలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా: ఏపీ రాజధానిపై జగన్ సంచలనం
ప్రణీత్ రావు నేతృత్వంలోని టీమ్ గూఢచర్యానికి పాల్పడిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రణీత్ రావు సస్పెన్షన్ కు సంబంధించి పోలీస్ శాఖ విచారణ చేస్తుంది. ప్రణీత్ రావు హైద్రాబాద్ ను వీడవద్దని కూడ సస్పెన్షన్ ఆర్డర్ లో పేర్కొంది.
also read:టీడీపీలో చేరుతా:వైఎస్ఆర్‌సీపీకి గుమ్మనూరు జయరాం రాజీనామా
గత ప్రభుత్వ హయంలో విపక్ష పార్టీకి చెందిన నేతల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ విషయమై ప్రస్తుతం విచారణ చేయనున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ప్రణీత్ రావు ఎక్కువ కాలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేశారు. ఇంటలిజెన్స్ విభాగంలో ప్రభాకర్ రావు జాయిన్ అయ్యాక ప్రణీత్ రావు ఇంటలిజెన్స్ విభాగంలో చేరారని సమాచారం.
తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కొందరు పోలీస్ అధికారులపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలు కూడ ఈ విషయమై ఆరోపణలు చేశారు. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని విపక్షపార్టీల నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై కాంగ్రెస్ సర్కార్ చర్యలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రణీత్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది.