కేసీఆర్ ఆదేశం, కదిలిన సర్కార్: ప్రియాంక కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు
డాక్టర్ ప్రియంకా రెడ్డి హత్య కేసు విచారణను వేగంగా చేపట్టి దోషులకు కఠినంగా శిక్షపడేలా స్పెషల్ కోర్టుని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించిన సంగతి తెలిసిందే.
డాక్టర్ ప్రియంకా రెడ్డి హత్య కేసు విచారణను వేగంగా చేపట్టి దోషులకు కఠినంగా శిక్షపడేలా స్పెషల్ కోర్టుని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
ప్రత్యేక కోర్టు ఏర్పాటుపై హైకోర్టుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు.ప్రత్యేక కోర్టు ఏర్పాటైన వెంటనే రోజు వారీ పద్దతిలో విచారణ జరిపి నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read:డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య: ఆ ముగ్గురూ పోకీరీలే, బైక్‌పై డేంజర్ సింబల్
ప్రత్యేక కోర్టుల ఏర్పాటు వల్ల బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందన్న ఆయన.. ప్రత్యేక కోర్టు ఏర్పాటుపై న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు.
డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. మానవ మృగాలు మన మధ్యనే తిరుగుతున్నాయన్నారు.
Also Read:ప్రియాంక రెడ్డి ఘటన: తన తల్లికి నిందితుడు చెప్పిన కట్టు కథ తెలుసా...?
శంషాబాద్‌లో జరిగిన ఘటన అమానుషమని, రాత్రి వేళలలో మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేయొద్దని ఆయన అధికారులను ఆదేశించారు. అదే సమయంలో మహిళా ఉద్యోగులు రాత్రి 8 గంటల లోపే విధులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని కేసీఆర్ సూచించారు.
నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రియాంక కేసును త్వరితగతిన విచారించాలని, కేసును వేగంగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు.
Also read:ప్రియాంక రెడ్డి హత్య: నాడు వరంగల్‌లో ఎన్‌కౌంటర్, నేడు సజ్జనార్ ఏం చేస్తారు?
ఒక్క రూట్‌లో కూడా ప్రైవేట్ బస్సులకు అనుమతివ్వమని.. కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి కలకాలని ముఖ్యమంత్రి తెలిపారు. యధావిధిగా ఉద్యోగుల ఇంక్రిమెంట్లు ఇస్తామని.. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ఇస్తామని సీఎం వెల్లడించారు.
చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి 8 రోజుల్లోపు ఉద్యోగం కల్పిస్తామని.. కలర్ బ్లైండ్‌నెస్ వున్న వారిని వేరే విధులకు మార్చాలి తప్ప వారిని తొలగించవద్దని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు 3 నెలల చైల్డ్ కేర్ లీవ్స్ ఇస్తామని, మహిళా ఉద్యోగులకు ఖాకీ డ్రెస్ నిబంధన తొలగిస్తామని సీఎం స్పష్టం చేశారు.