ప్రియాంక రెడ్డి ఘటన: తన తల్లికి నిందితుడు చెప్పిన కట్టు కథ తెలుసా...?
ప్రియాంక రెడ్డి హత్యాచారం ఉదంతం యావత్ భారతదేశాన్ని కలచి వేస్తుంది.ఇంతటి నరరూప రాక్షసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉన్న మహమ్మద్ ఆరిఫ్ తన తల్లికి చెప్పిన కట్టు కథ వింటే నోరెళ్లబెట్టవలిసి వస్తుంది.
హైదరాబాద్: ప్రియాంక రెడ్డి హత్యాచారం ఉదంతం యావత్ భారతదేశాన్ని కలచి వేస్తుంది. నిందితులు ఆరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్ లు అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఆపై ఊపిరాడకుండా చేసి హత్య చేసారు. ఆ తరువాత అతి పాశవికంగా శవంపై కూడా అత్యాచారానికి ఒడిగట్టారు. ఇంతటి నరరూప రాక్షసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉన్న మహమ్మద్ ఆరిఫ్ తన తల్లికి చెప్పిన కట్టు కథ వింటే నోరెళ్లబెట్టవలిసి వస్తుంది.
ఆరిఫ్ ఆ రాత్రి ఈ అమానుషమైన సంఘటనకు ఒడిగట్టిన తరువాత ఇటుకల లోడ్ దింపి మహబూబ్ నగర్ జిల్లా జాక్లూర్ గ్రామంలోని తన సొంత ఇంటికి చేరుకున్నాడు. ఆ రాత్రి అతని తల్లి మొలాన్బీ అతను టెన్షన్ పడడం చూసి తల్లి ఏమైందని అడిగింది.
Also read:మానవ మృగాలు మన మధ్యనే తిరుగుతున్నాయి: ప్రియాంక ఘటనపై కేసీఆర్ స్పందన
తొలుత అందరూ నిద్రపోండని ఆరిఫ్ అన్నప్పటికీ, ఆ తరువాత అతని తల్లి మరో మారు అడగడంతో, తాను ఒక మహిళను చంపానని ఒప్పుకున్నాడు. కాకపోతే ఇలా రేప్ చేసి చంపానని కాకుండా లారీ ఆక్సిడెంట్ లో అంటూ కవరింగ్ ఇచ్చాడు.
Also read: నో అప్పీల్స్.. ఓన్లీ హ్యాంగింగ్: చట్టాలను మార్చండి, ప్రధాని మోడీకి కేటీఆర్ ట్వీట్
తాను లారీ నడుపుతుండగా ఎదురుగా బైక్ మీద ఒక జంట వచ్చిందని, లారీ కంట్రోల్ కాక వారిని గుద్దేసినట్టు చెప్పాడు. ఆ ఘటనలో బైక్ వెనక కూర్చున్న మహిళా అక్కడికక్కడే మరణించినట్టు చెప్పాడు. అతని తండ్రి మాత్రం జాగ్రత్తగా నడపమని మందలించాడు.
ఆ రాత్రి అతడు ఇక అందరూ పడుకోండి తనకు కొంచం రెస్ట్ కావాలని చెప్పడంతో అంతా పడుకున్నారు. ఆ తరువాత పోలీసులు రావడం అతగాడిని పట్టుకెళ్ళడం అన్ని జరిగిపోయాయి.
తన కొడుకు చేసిన దుర్మార్గమైన దారుణపు పని గురించి అతని తల్లి తెలుసుకోబడానికి కానీ, ఆ విషయమై స్పందించడానికి కూడా ఇష్టపడడం లేదు. అతని తండ్రి కూడా గతంలో లారీ డ్రైవర్ గానే పని చేసేవాడు.
Also read: రేప్ చేస్తే ఇక ఉరి శిక్షే... నూతన చట్టం చేసే పనిలో కేంద్రం
అతను లారీ నుండి కింద పడడంతో పనికి వెళ్లలేకపోతున్నాడు. ఆరిఫ్ తల్లికి కూడా మొన్ననే ఆపరేషన్ జరగడంతో ఆమె కూడా ఏ పని చేసుకోలేకుండా ఉంది.
ఆరిఫ్ చేసిన అతి నీచమైన దారుణం వల్ల ఒక మహిళ ప్రాణం కోల్పోవడమే కాకుండా వేరే ఆధారం లేని కుటుంబాన్ని కూడా రోడ్డున పడేసాడు.
Also read:ప్రియాంక రెడ్డి హత్య: నాడు వరంగల్‌లో ఎన్‌కౌంటర్, నేడు సజ్జనార్ ఏం చేస్తారు?