రాష్ట్రంలో లాక్‌డౌన్ ఆదేశాలు ఉన్నా ఆటోలు, క్యాబ్‌లు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని మండిపడ్డారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. క్యాబ్‌, ఆటోల యజమానులు వాటిని అద్దెకు ఇవ్వొద్దని, ఒకవేళ ఆదేశాలను ఉల్లంఘిస్తే డ్రైవర్లు, ఓనర్లపై కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.

Also Read:లాక్ డౌన్ బేఖాతరు: ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహం

ఓలా, ఉబెర్, బౌన్స్ వంటి కార్పోరేట్ కంపెనీలు సేవలు నిలిపివేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 18004250817 అనే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారని ప్రజలు దీనికి ఫోన్ చేసి సందేహాలు, సాయం పొందొచ్చని తెలిపారు.

బ్యాంకులు, ఏటీఏం, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, రిటైల్ మార్కెట్లు వంటి నిత్యావసర సేవలు అందించే సంస్థలకు లాక్‌డౌన్ మినహాయింపు ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు హోం క్వారంటైన్‌లో ఉండాలని సజ్జనార్ సూచించారు.

Also Read:తెలంగాణలో 33కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు: 3 కాంటాక్ట్ కేసులు

పరిస్థితి విషమించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని సీపీ వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడవద్దని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కమీషనర్ తెలిపారు. అనవసరంగా వాహనాల్లో బయటకు తిరిగితే సీజ్ చేస్తామని సజ్జనార్ హెచ్చరించారు.