Asianet News TeluguAsianet News Telugu

మేడారం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

మేడారం (medaram) వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం ఉపశమనం అందించింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ( sammakka sarakka jatara) ఏటూరునాగారం రిజర్వ్ ఫారెస్ట్ (Eturunagaram Reserve Forest) మీదుగా వెళ్లే వాహనాలకు పర్యావరణ ప్రభావ ఫీజు (Environmental Impact Fee)ను వసూలు చేయకూడదని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ (Telangana Forest Minister Konda Surekha) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Telangana govt announces good news for devotees going to Medaram..ISR
Author
First Published Feb 2, 2024, 10:26 AM IST | Last Updated Feb 2, 2024, 10:26 AM IST

Medaram : మేడారం వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి (ఫిబ్రవరి 2) నుంచి 29వ తేదీ వరకు సమ్మక్క సారక్క జాతర (మేడారం జాతర)కు ఏటూరునాగారం రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా వెళ్లే వాహనాలకు పర్యావరణ ప్రభావ రుసుము నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ విషయాన్ని తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు.

మూడు రోజుల మచ్చటేనా ?.. నిలిచిపోయిన ‘మేల్స్ స్పెషల్’ బస్సు.. అసలేమైందంటే ?

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఇందులో భాగంగా జాతర పూర్తయ్యే వరకు అటవీ శాఖ వసూలు చేసే రుసుమును నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను అడవుల్లో వేయవద్దని, పరిశుభ్రత పాటించాలని భక్తులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఒకటో తేదీనే జీతమా..! నా భార్య కూడా నమ్మట్లేదు... : సీఎం రేవంత్ తో ఓ ప్రభత్వోద్యోగి

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఇటీవల అయోధ్యలో జరిగిన రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టలో అందరినీ భాగస్వాములు చేసేందుకు దేశ వ్యాప్తంగా రామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశ వ్యాప్తంగా అక్షింతలు పంపిణీ చేసినట్టుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా మేడారం జాతరలో తెలంగాణ ప్రజలను భాగస్వాములు చేయాలని భావిస్తోంది. 

బడ్జెట్ లో దక్షిణాదికి అన్యాయం.. అందుకే ప్రత్యేక దేశం అవసరం - కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు వివాదాస్పదం

అందులోభాగంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు బంగారంగా భావించే బెల్లంతో పాటు అమ్మవారి పసుపు, కుంకుమలను  పంపిణీ చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. సమ్మక్క-సారలమ్మల బెల్లం ప్రసాదాన్ని, పసుపు కుంకుమను పంచే బాధ్యతను కాంగ్రెస్ శ్రేణులకే అప్పగించాలని ఇటీవల జరిగిన కాంగ్రెస్ నాయకుల సమావేశంలో మంత్రులు ప్రతిపాదించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios