బడ్జెట్ లో దక్షిణాదికి అన్యాయం.. అందుకే ప్రత్యేక దేశం అవసరం - కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు వివాదాస్పదం
నేటి బడ్జెట్ (Union Budget 2024)లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Government) దక్షిణాది రాష్ట్రాల (South States) పై వివక్ష చూపిందని కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు (Karnataka Congress Leader), ఎంపీ డీకే సురేష్ (MP DK Suresh) ఆరోపించారు. అందుకే దక్షిణాదిని ప్రత్యేక దేశం (separate country for South) చేయాలని అన్నారు. తనకు ఇలా డిమాండ్ చేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదని ఆవేదన వ్యకం చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో గురువారం ప్రవేశపెట్టిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ డీకే సురేష్ అన్నారు. అందుకే దక్షిణ భారతదేశానికి ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేయడం తప్ప మరో మార్గం లేదని అన్నారు. కేంద్రం నుంచి కర్ణాటకకు తగినన్ని నిధులు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ ఇదో నినాదమే కాదు.. పాలనా భావజాలం - రాజీవ్ చంద్రశేఖర్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై డీకే సురేశ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ లో దక్షిణ భారత దేశానికి రావాల్సిన నిధులను దారి మళ్లించి ఉత్తర భారతదేశానికి పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణ భారతంపై హిందీ ప్రాంతం విధించిన పరిస్థితుల ఫలితంగా ప్రత్యేక దేశం అడగడం తప్ప మరో మార్గం లేదని అన్నారు.
కాగా.. డీకే వ్యాఖ్యలు దుమారాన్నే రేపాయి. దీనిపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి విభజించి పాలించే చరిత్ర ఉందని అన్నారు. కానీ ఆ పార్టీ ఎంపీ డీకే సురేశ్ ఇప్పుడు మళ్లీ ఆ ట్రిక్ ను ప్లే చేస్తున్నారని, ఉత్తర, దక్షిణ ప్రాంతాలు విడిపోవాలని కోరుకుంటున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కర్ణాటకకు పన్నుల బదలాయింపు పెరిగిందనే ఆయన లెక్కలు చెప్పారు.
Union Budget 2024 : 57 నిమిషాలే మాట్లాడిన నిర్మలా సీతారామన్.. అతి చిన్న ప్రసంగంగా రికార్డ్
‘‘ఓ వైపు ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తన జోడో యాత్రలతో దేశాన్ని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే తపన ఉన్న ఎంపీ మనకున్నారు. విభజించి పాలించాలన్న కాంగ్రెస్ ఆలోచన వలసవాదుల కంటే దారుణంగా ఉంది’’ అని తేజస్వి సూర్య ట్వీట్ చేశారు. కన్నడిగులు ఎప్పటికీ ఇలా జరగనివ్వరని, లోక్ సభ ఎన్నికల్లో వారికి దీటైన సమాధానం చెబుతామని, కాంగ్రెస్ ముక్త్ భారత్ ఫలప్రదం అయ్యేలా చూస్తామని చెప్పారు.
బడ్జెట్ 2024 హైలెట్స్ : పన్ను రేట్లు యథాతథం.. పీఎం స్వానిధి ద్వారా మరో 2.3 లక్షల మందికి లోన్లు..
మరో బీజేపీ నేత అశోక స్పందిస్తూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తుంటే, కర్ణాటక కాంగ్రెస్ నేత, ఎంపీ డీకే సురేశ్ భారత్ తోడో గురించి మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విభజించి పాలించే విధానం ఫలితంగా దేశం ఇప్పటికే ఒకసారి విభజనను చవిచూసిందని, ఇప్పుడు మళ్లీ భారతదేశాన్ని విడగొట్టాలని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసిన పార్లమెంటు సభ్యుడు ఇలా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ విభజన మనస్తత్వానికి నిదర్శనమన్నారు.