ఒకటో తేదీనే జీతమా..! నా భార్య కూడా నమ్మట్లేదు... : సీఎం రేవంత్ తో ఓ ప్రభుత్వోద్యోగి
సరిగ్గా పిబ్రవరి ఒకటో తేదీనే తన ఖాతాలో సాలరీ డబ్బులు పడటంతో తాను ఆశ్చర్యపోయానని... ఈ విషయం తన భార్యకు చెబితే అసలు నమ్మలేదని తెలంగాణకు చెందిన ఓ ప్రభుత్వోద్యోగి సీఎం రేవంత్ తో తెలిపాడు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ కమిట్ మెంట్ కు ఫిదా అవుతున్నారు. చాలాకాలం తర్వాత ఒకటో తేదీనే తమ ఖాతాల్లో జీతం డబ్బులు పడటంచూసి ఆశ్చర్యపడుతూనే ఆనందం వ్యక్తంచేస్తున్నారు వేతన జీవులు. ఓ ఉద్యోగి అయితే పిబ్రవరి ఫస్ట్ కే జీతం డబ్బులు ఖాతాలో పడ్డాయంటే తన భార్య నమ్మడంలేదంటూ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే తెలిపాడు. తనకు ఎదురైన అనుభవాన్ని సరదాగా వివరిస్తూ ఓ ట్వీట్ రాసిన ఉద్యోగి దాన్ని సీఎం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేసాడు.
పిబ్రవరి నెల ప్రారంభంరోజే అంటే ఫస్ట్ తారీఖునే తనకు జీతం వచ్చింది... ఈ విషయాన్ని భార్యకు చెబితే నమ్మడంలేదని సదరు ప్రభుత్వోద్యోగి పేర్కొన్నాడు. ఇలా తామే కాదు తమ కుటుంబసభ్యులు కూడా ఫస్ట్ కే జీతాలుపడటం చూసి ఆశ్చర్యపోతున్నారని అన్నారు. ఇలా నిర్ణీత సమయానికి తమ ఖాతాల్లో జీతాలుపడటం ఆనందంగా వుందని... ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఉద్యోగి పేర్కొన్నాడు. ఇలా తన ఆనందాన్ని ఎక్స్ వేదికన వ్యక్తం చేసిన ఉద్యోగి ట్వీట్ కు తెలంగాణ కాంగ్రెస్ రీట్వీట్ చేసింది.
గత బిఆర్ఎస్ పాలనలో సమయానికి జీతాలు రాక ఇబ్బందిపడినట్లు ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ప్రతినెలా ఒకటో తేదీన పడాల్సిన జీతాలు కొందరికి పదిరోజులు మరికొందరికి 15 రోజుల తర్వాత పడుతున్నట్లు ఉద్యోగులు వాపోయేవారు. దీంతో ఇంటి అద్దెలు, ఈఎంఐలు, కుటుంబ అవరసరాల కోసం డబ్బులు లేక ఇబ్బందిపడినట్లు ఉద్యోగులు తెలిపారు.
Also Read రేవంత్ మార్క్ ప్రజాపాలన షురూ... బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు భారీ నిధులు
ఇక పెన్షన్ డబ్బులపై ఆదారపడి రిటైర్మెంట్ జీవితాన్ని గడుపుతున్న వారి పరిస్థితి మరింత దారుణం... వారికి కూడా పెన్షన్ డబ్బులు ఆలస్యంగా పడేవి. దీంతో ప్రతినెలా మెడిసిన్స్, నిత్యావసరాలు కొనేందుకు ఇబ్బంది పడినట్లు రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసారు. అయితే ఇప్పుడు సరిగ్గా పిబ్రవరి పస్ట్ నే ఖాతాల్లో డబ్బులు పడటంతో వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.