Asianet News TeluguAsianet News Telugu

మాట నిలబెట్టుకున్న కేసీఆర్: ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వారి పదవీవిరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Government to raise RTC staff retirement age from 58 to 60
Author
Hyderabad, First Published Dec 25, 2019, 6:15 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వారి పదవీవిరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి బుధవారం సంతకం చేశారు. ఆర్టీసీలోని ప్రతి ఉద్యోగికి ఈ కొత్త నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన తర్వాత డిసెంబర్ 1వ తేదీన ప్రగతి భవన్ లో ఆర్టీసీ ఉద్యోగులతో కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్టీసీ పై సీఎం వరాల జల్లు కురిపించారు.

Also Read:అశ్వత్థామ రెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం భలే షాక్

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నేరవేర్చారు. ఇటీవల తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిచాలని.. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ నెల రోజులకు పైగా సమ్మె నిర్వహించారు.

ఆ తర్వాత కేసీఆర్ నిర్ణయంతో... తిరిగి విధుల్లోకి చేరారు. అయితే... వారు సమ్మె చేస్తున్న సమయంలో.... ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని ఇప్పుడు కేసీఆర్ అమలులోకి తీసుకువచ్చారు.  

ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తిస్తూ టీఎస్ ఆర్టీసీ సర్క్యులార్ జారీచేసింది. ఇకపై ఆర్టీసీ కార్మికులు అనే పదం వాడకూడదని.. ఆర్టీసీ ఉద్యోగులని అధికారిక కమ్యూనికేషన్‌లో పేర్కొనాలని సర్క్యులర్‌లో తెలిపింది.

Also Read:RTC Strike: ఒకే దెబ్బ, కీలెరిగి వాత పెట్టిన కేసీఆర్

యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కాదు.. అందరూ ఒకటే, ఒకటే కుటుంబంలాగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ ఈ మార్పులు చేసింది. సీఎం నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తచేశారు. ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచడంతో పాటు సమ్మె కాలానికి (52 రోజులు) సంబంధించిన వేతనాలు కూడా చెల్లిస్తామని ఆ రోజు చెప్పారు.

ఆర్టీసీలో ఒక్క ఉద్యోగినీ ఉద్యోగంలోంచి తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఒక్క రూటులో ఒక్క ప్రైవేటు బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు
 

Follow Us:
Download App:
  • android
  • ios