తెలంగాణ నుండి పోటీకి సోనియా నిరాకరణ, తెరపైకి రాహుల్: ఆ మూడు స్థానాలపై ఫోకస్
తెలంగాణ నుండి కాంగ్రెస్ అగ్రనేతను పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.
తెలంగాణ నుండి పోటీకి సోనియా నిరాకరణ, తెరపైకి రాహుల్: ఆ మూడు స్థానాలపై ఫోకస్
రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభకు సోనియా గాంధీ ఎన్నిక కావడంతో తెలంగాణ నుండి రాహుల్ గాంధీని పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ కోరుతుంది. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.
తెలంగాణ నుండి పోటీకి సోనియా నిరాకరణ, తెరపైకి రాహుల్: ఆ మూడు స్థానాలపై ఫోకస్
గత ఏడాది నవంబర్ మాసంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి మెజారిటీ సీట్లను దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది.
తెలంగాణ నుండి పోటీకి సోనియా నిరాకరణ, తెరపైకి రాహుల్: ఆ మూడు స్థానాలపై ఫోకస్
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి సోనియా గాంధీని పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసింది.ఈ తీర్మానాన్ని సోనియా గాంధీకి కూడ అందించారుఅయితే ఆరోగ్య కారణాల రీత్యా ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సోనియా గాంధీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.దరిమిలా రాజస్థాన్ నుండి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచారు. రాజస్థాన్ నుండి సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దరిమిలా తెలంగాణ నుండి రాహుల్ గాంధీని పోటీ చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కోరిందని ప్రచారం సాగుతుంది.
తెలంగాణ నుండి పోటీకి సోనియా నిరాకరణ, తెరపైకి రాహుల్: ఆ మూడు స్థానాలపై ఫోకస్
రాహుల్ గాంధీ పోటీ చేస్తే దాని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిపై ఉంటుందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ నుండి రాహుల్ గాంధీ విజయం సాధించారు.ఈ దఫా తెలంగాణ నుండి పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.
తెలంగాణ నుండి పోటీకి సోనియా నిరాకరణ, తెరపైకి రాహుల్: ఆ మూడు స్థానాలపై ఫోకస్
తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలున్నాయి.ఈ 17 పార్లమెంట్ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ టార్గెట్ గా పెట్టుకొంది. 2019 ఎన్నికల్లో తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాల్లోనే విజయం సాధించింది.ఈ దఫా రెండంకెల స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ నుండి పోటీ చేయాలని రాహుల్ ను కాంగ్రెస్ నాయకత్వం కోరిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
తెలంగాణ నుండి పోటీకి సోనియా నిరాకరణ, తెరపైకి రాహుల్: ఆ మూడు స్థానాలపై ఫోకస్
నల్గొండ, భువనగిరి, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి రాహుల్ గాంధీని బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తుంది. అయితే రాహుల్ గాంధీ తెలంగాణ నుండి పోటీ చేసే విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదని సమాచారం. భారత్ న్యాయ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు.