మొయినాబాద్ ఫాంహౌస్ కేసు:మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు,బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు

మొయినాబాద్ ఫాం హౌస్  లోని  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రత పెంచింది.బుల్లెట్ ప్రూఫ్  వాహనాలను కేటాయించింది.

Telangana Government  increases Security  for ThreeTRS  MLAS

హైదరాబాద్:మొయినాబాద్ ఫాం  హౌస్  ఘటనలో ఉన్న టీఆర్ఎస్  ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రతను పెంచింది.  నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలతో  పాటు ఎస్కార్ట్ సౌకర్యం  కల్పించింది.ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భద్రతను ఏర్పాటు చేసింది  తెలంగాణ ప్రభుత్వం.

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు , కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.,తాండూరు ఎమ్మెల్యే  పైలెట్  రోహిత్ రెడ్డిలను  ముగ్గురు ప్రలోభాలకు గురి చేశారని  కేసు నమోదైంది.  పైలెట్  రోహిత్  రెడ్డి మొయినాబాద్  పోలీస్ స్టేషన్  లో   ఫిర్యాదు  చేశారు. ఈ ఫిర్యాదు  మేరకు రామచంద్రభారతి,  సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ కేసులో అరెస్టైన ఈ  ముగ్గురు ప్రస్తుతం  చంచల్ గూడ  జైలులో ఉన్నారు.  ఎమ్మెల్యేలతో  ఈ  ముగ్గురు మాట్లాడినట్టుగా  ఉన్న ఆడియో సంభాషణలు మీడియా  ప్రసారం చేసింది.  ఈ ఘటనకు  సంబంధించిన వీడియోను తెలంగాణ సీఎం కేసీఆర్  గురువారంనాడు రాత్రి  మీడియా సమావేశంలో  ప్రదర్శించారు. వీడియోను మీడియాకు విడుదల చేశారు.  ఈ  వీడియోలను అన్ని  రాష్ట్రాలకు కూడా పంపారు.

also read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు: నిందితుల పిటిషన్ పై విచారణ ఈ నెల 7కి వాయిదా

రోహిత్ రెడ్డికి 4+4 గన్ మెన్లను కేటాయిస్తూ గత నెల  29న  తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ  చేసింది.రోహిత్  రెడ్డికి  2+2 గా గన్ మెన్లను  పెంచింది. అంతేకాదు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది  ప్రభుత్వం. ఇవాళ మరో ముగ్గురు  ఎమ్మెల్యేలకు కూడా ప్రభుత్వం  భద్రతను పెంచింది. 2+2 గా గన్ మెన్లను 4+4 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  అంతేకాదు  గువ్వల  బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించింది. ఈ  నలుగరు ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భద్రతను ఏర్పాటు  చేసింది  ప్రభుత్వం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios