Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు: నిందితుల పిటిషన్ పై విచారణ ఈ నెల 7కి వాయిదా


టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న  ముగ్గురు దాఖలు  చేసిన పిటిషన్  పై విచారణను సుప్రీంకోర్టు  ఈ నెల 7వ  తేదీకి  వాయిదా వేసింది.

Moinabad Farm House:Supreme Court adjourns for 3 Days  hearing on plea challenging verdict on Telangana  High Court
Author
First Published Nov 4, 2022, 3:28 PM IST

న్యూఢిల్లీ:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో  ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులు దాఖలుచేసిన  పిటిషనపై విచారణను  సుప్రీంకోర్టు ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.ఆరోపణలను ఎదుర్కొంటున్నవారిని రిమాండ్ నే  ట్రయల్  కోర్టు తిరస్కరించిన విషయాన్ని  నిందితులతరపున్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి  వర్తించవని   సుప్రీంకోర్టు దృష్టికి  తీసుకు  వచ్చారు.ఈ అంశానికి  సంబంధించి కోర్టు  చేసిన వ్యాఖ్యలను  ఆయన ప్రస్తావించారు.

ఆ తర్వాత రెండు రోజులకే  నిందితులను  రిమాండ్  విధిస్తూ  తెలంగాణ  హైకోర్టు తీర్పును  ఇచ్చిందని సుప్రీంకోర్టుకు  నిందితుల తరపు న్యాయవాది చెప్పారు.కేసులో మెరిట్స్ ను సరిగా పరిగణనలోకి  తీసుకోకుండా  కోర్టు  తీర్పు వెలువరించిందని  నిందితుల తరపు న్యాయవాది వాదించారు హైకోర్టు  భిన్నమైన  తీర్పును ఎలా  ఇస్తుందని .ఈ వాదనలు విన్న జస్టిస్ గవాయి,  బీవీ నాగరత్నంలతో  కూడిన  సుప్రీంకోర్టు  ధర్మాసనం అభిప్రాయపడింది. పోలీసులు  ప్రభుత్వం చెప్పినట్టుగా దర్యాప్తును నిర్వహించారని కూడ నిందితుల తరపున న్యాయవాది వాదించారు. అయితే ఈపిటిషన్ పై ఈ నెల 7న  విచారణ చేస్తామని  సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios